బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైనా సమయమా?

బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైనా సమయమా?

ఆగస్టులో బంగారం ధర రూ.56200. ఇప్పుడు 50వేల వద్ద ట్రేడ్ అవుతోంది. వాస్తవానికి ఆగస్టులో ఈ మెటల్ ధరలు పెరిగినప్పుడు త్వరలో రూ.80వేలకు చేరుతుందని.. ఇన్వెస్టిమెంట్ కు అధ్బుత అవకాశం అన్నారు. కానీ సీను రివర్స్ అవుతోంది. ప్రస్తుతం నాటి ధరకు రూ.6వేలు తగ్గి రూ.50వేల వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో గత మూడు రోజుల్లో బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.570 తగ్గుదలతో రూ.51,650కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.530 దిగొచ్చింది. దీంతో ధర రూ.47,340 వద్ద తేలియాడుతోంది.

బంగారం నేల చూపులు చూస్తుంటే.. వెండి ఆకాశం వైపు పరుగులు తీస్తోంది. కేజీ వెండి 3 రోజుల్లో రూ.3వేలకు పైగా పెరిగింది. ప్రస్తుతం కేజీ రూ.65,200కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో వెండికి డిమాండ్ పెరుగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర తగ్గింది. యల్లో మెటల్ ఔన్స్‌కు 1907 డాలర్ల నుంచి 1878 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఔన్స్‌కు 23.71 డాలర్లకు తగ్గింది.

యెల్లో మెటల్ ధరల హెచ్చుతగ్గులపై అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్లో లాభాలు వస్తుండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లవైపు ద్రుష్టిపెట్టారు. అటు ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ ఎఫెక్ట్ అధికంగా ఉంది. ఇక కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ధరపై ప్రభావం చూపుతున్నాయి.

ఏది ఏమైనా బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి మంచి సమయం. అలాగని ఇన్వెస్ట్ మెంట్ కు తగిన సమయం కాదని నిపుణులు అంటున్నారు. కేవలం అవసరాలకుమాత్రమే కొనడం మంచిది. ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకునేవారు ఇంకొంతకాలం ఆగితే మంచిది. ప్రస్తుతం గోల్డ్ మార్కెట్లో అనిశ్చితి కనిపిస్తోంది. దంతేరస్ కారణంగా మళ్లీ పెరిగిన.. తర్వాత తగ్గే ఛాన్స్ ఉంది. సొ.. అవసరాలకు కొనడానికి మంచి సమయమే అయినా.. పెట్టుబడి అయితే కాస్త ఆగాలంటున్నారు.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story