బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు..

బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు..
బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచి భారీగా తగ్గింది.

బంగారం ధర తగ్గడం వరుసగా ఇది నాలుగో రోజు కావడం విశేషం. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 క్షీణించింది. రూ.51,340కు దిగొచ్చింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.47,000కు పడిపోయింది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచి భారీగా తగ్గింది. రూ.1600 తగ్గుదలతో వెండి ధర రూ.66,700కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ఔన్స్ ధర 0.02 శాతం తగ్గుదలతో 1864 డాలర్లకు క్షీణించింది. కానీ అక్కడ బంగారం ధర తగ్గితే వెండి ధర పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 24.12 డాలర్లకు ఎగసింది. పసిడి ధరలో హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, బ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు అధికంగా ప్రభావం చూపుతాయి.

Tags

Read MoreRead Less
Next Story