బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? పెరుగుతాయా?

బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? పెరుగుతాయా?

గత 4 రోజులుగా బంగారం ధర దిగివస్తోంది. గతవారం రూ.54వేలకు కాస్త అటూఇటూగా ఉన్న బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో రూ.51వేలు పలుకుతోంది. బాండ్‌ యూఎస్‌ బాండ్‌ ఈల్డ్‌పై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరగడంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి. గత కొన్నిరోజులుగా అప్‌ట్రెండ్‌లో ఉన్న గోల్డ్‌ ధర గత 4 రోజుల్లో 5శాతం పైగా తగ్గింది. ఇవాళ ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్టులో బంగారం ధర రూ.20 తగ్గి రూ.49,321 వద్ద కొనసాగుతోంది. సిల్వర్‌ ధర ఎంసీఎక్స్‌లో రూ.190 తగ్గి రూ.65,365 వద్ద ట్రేడవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్‌ ధర నెమ్మదించింది. ఇవాళ దాదాపు 2 డాలర్లు క్షీణించి ఔన్స్‌ గోల్డ్‌ 1849కు తగ్గింది. గత కొన్ని రోజులుగా 1900 ఎగువన స్థిరంగా కదలాడుతోన్న ఔన్స్‌ గోల్డ్‌ ఇటీవలే 1800 మార్కుకు సమీపంలోకి వచ్చింది. 1800 స్థాయి వద్ద సపోర్ట్‌ లభించింది. ఇక దేశీయ మార్కెట్లోనూ సెంటిమెంట్‌ బలహీనపడి ధరలు దిగివచ్చాయి. చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.51,054 కాగా 22 క్యారెట్ 10 గ్రాముల రీటైల్ బంగారం ధర రూ.46,800గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.69,600గా ఉంది.

యూఎస్‌లో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొనడం, గత కొంతకాలం నుంచి డాలర్‌ వీక్‌గా ఉండటం, అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే అంచనాలు బలపడటంతో పదేళ్ళ బాండ్‌ ఈల్డ్‌ భారీగా పెరిగింది. ప్రస్తుతం పదేళ్ళ బాండ్‌ ఈల్డ్‌ గత ఏడాది మార్చి గరిష్ట స్థాయి వద్ద కదలాడుతోంది. దీంతో ఈ వారం గోల్డ్‌ ఫ్యూచర్స్‌లో బంగారం ధర మరింత క్షీణించే అవకాశముందని బులియన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సిక్స్‌ బాస్కెట్‌ కరెన్సీలో డాలర్‌ క్రమంగా బలపడుతుండటం, అలాగే బిట్‌కాయిన్‌లోకి పెట్టుబడులు వేగంగా పెరుగుతుండటంతో బంగారం ధర క్షీణించే అవకాశముందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బంగారానికి ప్రత్యామ్నాయంగా బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆపర్షన్‌గా ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపడం తదితర అంశాలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

గత ఏడాది కాలం నుంచి బిట్‌ కాయిన్‌ విలువ భారీగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలో 5వేల డాలర్ల నుంచి 41వేల డాలర్లకు బిట్‌కాయిన్‌ విలువ పెరిగింది. అయితే గత రెండు రోజుల్లో బిట్‌కాయిన్‌ విలువ దాదాపు 16శాతం క్షీణించింది.

Tags

Read MoreRead Less
Next Story