పరుగులు పెడుతున్న పసిడి ధర!

పరుగులు పెడుతున్న పసిడి ధర!
గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర పరుగులు పెడుతోంది.

గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి ధర పరుగులు పెడుతోంది. వరుసగా ఐదో రోజు బంగారం ధర పెరగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పైకి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగింది. రూ.47,300కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరిగింది. రూ. 51,600కు చేరింది.

సోమవారంతో పోలిస్తే మంగళవారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరిగింది. సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,180 గా ఉంది. మంగళవారం రూ.51,600కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. సోమవారం రూ.46,910గా ఉంది. మంగళవారం రూ.390 పెరగటంతో రూ.47,300కు ఎగసింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,160 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,530గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,230గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,230గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,080గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,530గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,860గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,610గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 03-01-2021 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story