Top

దూసుకెళ్తున్న గోల్డ్ ధర!

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దూసుకెళ్తున్న గోల్డ్ ధర!
X

గోల్డ్ ధర దూసుకెళ్తుంది. పసిడి ధర గురువారం కూడా పరుగులు పెడుతూనే ఉంది. బుధవారం బంగారం ధర కొంచెం పెరిగితే.. గురువారం కూడా పైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పైకి కదిలింది. రూ.49,960కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,800కు ఎగసింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,510 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,910గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,260గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,430గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,230గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది.


గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 21-01-2021 ఉదయం 8 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Next Story

RELATED STORIES