20వ వార్షికోత్సవ సందర్భం.. యాక్టివా 6జి స్పెషల్ ఎడిషన్..

20వ వార్షికోత్సవ సందర్భం.. యాక్టివా 6జి స్పెషల్ ఎడిషన్..
20 వ వార్షికోత్సవ ఎడిషన్ రెండు వేరియంట్లలో వస్తుంది, దీని ధర..

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన స్కూటర్ యాక్టివా 6 జి యొక్క ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. యాక్టివా బ్రాండ్ యొక్క ఇరవై సంవత్సరాల వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని మార్కెట్లో విడుదల చేసింది. ఇక దీని ధర వచ్చి రూ .66,816 (ఎక్స్-షోరూమ్ గురుగ్రామ్) నుండి ప్రారంభమవుతుందని సంస్థ యాజమాన్యం పేర్కొంది.

యాక్టివా 20 సంవత్సరాల అసమానమైన నాయకత్వ ప్రయాణంతో పాటు రెండు కోట్లకు పైగా భారతీయ కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయని సంస్థ. యాక్టివా 6 జి యొక్క 20 వ వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఒక ప్రకటనలో తెలిపింది.

"20 సంవత్సరాల క్రితం హోండా తన తొలి మోడల్ - యాక్టివాతో భారతీయుల కలల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. అప్పటి నుండి, హోండా యాక్టివా ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించింది అని హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, అధ్యక్షుడు, సీఈఓ అట్సుషి ఒగాటా అన్నారు.

యాక్టివా 6జి యొక్క 20 వ వార్షికోత్సవ ఎడిషన్ రెండు వేరియంట్లలో వస్తుంది, దీని ధర రూ.66,816, రూ .68,316. "ప్రతి భారతీయ కుటుంబం మొదటి ఎంపికగా, మా వినియోగదారులతో యాక్టివా విడదీయరాని బంధాన్నికొనసాగిస్తోంది అని హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్-సేల్స్ & మార్కెటింగ్ యాద్వీందర్ సింగ్ గులేరియా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story