మార్కెట్లోకి మరో ద్విచక్రవాహనం.. హోండా గ్రేజియా 125

మార్కెట్లోకి మరో ద్విచక్రవాహనం.. హోండా గ్రేజియా 125
పెరల్ నైట్ స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ కలర్లో ఇవి లభ్యమవుతున్నాయి.

ద్విచక్రవాహనాల్లో అగ్రగామి సంస్థ హోండా తాజాగా తన గ్రేజియా మోడల్లో సరికొత్త ఎడిషన్‌ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అదే హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.82.546గా సంస్థ నిర్దేశించింది. అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో రూపొందించిన ఈ స్కూటర్ ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్లో రెండు కొత్త పెయింట్ స్కీమ్స్‌తో పాటు ఫ్రెష్ బాడీ గ్రాఫిక్స్ ఉన్నాయి. పెరల్ నైట్ స్టార్ బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ కలర్లో ఇవి లభ్యమవుతున్నాయి. కాస్మటిక్ అప్డేట్ మినహా మిగతావన్నీ స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఇది ఉంది.

ఇంజన్..

ఈ 2021 హోండా గ్రేజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ 124 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 6000 ఆర్పీఎం వద్ద 8.14 బీహెచ్ బ్రేక్ హార్స్ పవర్, 5000 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది. ఇంకా ఈ స్కూటర్లో హోండా హెచ్‌ఈటీ (హోండా ఎకో టెక్నాలజీ), ఈఎస్పీ (ఎనహాన్పెడ్ స్మార్ట్ పవర్), ఏసీజీ (ఆల్టర్నేట్ కరెంట్ జనరేటర్) ను వాడారు. ఫలితంగా రీఫైన్మెంట్‌తో పాటు బండి సైలెంట్‌గా స్టార్ట్ అవుతుంది.

ఈ స్కూటర్‌కి ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు చూస్తే.. మల్టీఫంక్షన్ ఇగ్నేషన్ స్విచ్, ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఐడిల్ స్టార్ట్-స్లాప్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story