ఎక్కువ బంగారం ఉంటే లెక్కలు చెప్పాలంట.. లేదంటే..

ఎక్కువ బంగారం ఉంటే లెక్కలు చెప్పాలంట.. లేదంటే..

ఎందుకు డబ్బులన్నీ అట్లా వేస్ట్ చేస్తావు.. ఓ గ్రాము బంగారం కొంటే ఎప్పటికైనా పనికొస్తుంది అంటూ పెద్ద వాళ్లు ఇంట్లో పోరు పెడుతుంటారు.. అలా కొన్న బంగారం కొంత వరకు ఉంటే ఫరవాలేదు.. ఎక్కువ వుందంటే మాత్రం చిక్కులే. గోల్డ్ రేట్ తగ్గిందనో, పెళ్లి పేరంటం అనో అడపా దడపా బంగారం కొనేసి బ్యాంకులో పెడుతుంటారు.

అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు లేదంటే అమ్ముకోవచ్చని ముందు జాగ్రత్త పడుతుంటారు. బంగారం ఒక ఆర్థిక భద్రత.. భరోసాని ఇస్తుంది. అయితే లెక్కకు మించిన బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వారికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లెక్కలు చెప్పని జువెలరీని సీజ్ చేసే అధికారం ట్యాక్స్ అధికారులకు ఉంటుంది.

మీరు మీ వద్ద ఉన్న బంగారానికి డాక్యుమెంట్ ఫ్రూఫ్స్ ఉంటే ఎంత బంగారం ఉన్నా అభ్యంతరం లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT గతంలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పెళ్లైన మహిళ 500 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు. అదే పెళ్లి కాని అమ్మాయిలు అయితే 250 గ్రాముల బంగారం కలిగి ఉండొచ్చు.

అదే మగ వారు అయితే 100 గ్రాముల బంగారం తమ వద్ద ఉంచుకోవచ్చు. ఈ లిమిట్ దాటి బంగారం ఉంటే మాత్రం లెక్కలు చెప్పాల్సిందే అంటున్నారు ఆధాయపు శాఖ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story