Hyderabad : పెరిగిన బంగారం ధరలు

Hyderabad : పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని నగరాలలో బంగారం రేటు పెరిగిపోయింది

బంగారం ప్రియమైంది. హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని నగరాలలో బంగారం రేటు పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 60వేలు కానున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు, మాద్యం భయం, వడ్డీ రేట్ల మార్పుల వలన కూడా బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే కాక, భారత్ లాంటి దేశంలో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు భావిస్తుండటం, ఏ పండుగ వచ్చినా కొంత బంగారాన్నైనా కొనే ఆచారం ఉండటం కూడా ధర పెరిగేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వడ్డీ రేట్ల పెంపు రానున్న రోజుల్లో బంగారం ధరను మరింత పెరిగేలా చేయవచ్చని సమాచారం. రిటైల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని తెలుస్తోంది. భారతదేశం బంగారం దిగుమతిదారు కాబట్టి, యూఎస్ డాలర్ తో భారత రూపాయి విలువ క్షిణించడం, 15శాతం దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధర 4శాతానికి పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story