Live

BUDGET 2024 : బడ్జెట్ 2024 హై లైట్స్

BUDGET 2024 : బడ్జెట్ 2024 హై లైట్స్

2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశం ( Union Budget 2024 )

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ( nirmala sitharaman )తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమవుతుంది.

ఈ బడ్జెట్‌ ప్రసంగం లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి బడ్జెట్‌ ప్రసంగం కావడంతో, ప్రజల ఆశలు, అంచనాలపై ఈ బడ్జెట్‌ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

ఈ బడ్జెట్‌లో ప్రధానంగా ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై దృష్టి పెట్టబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ బడ్జెట్‌లో పన్నుల తగ్గింపు, పథకాల విస్తరణ, కొత్త పథకాల ప్రారంభం వంటి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.

Live Updates

  • 1 Feb 2024 6:29 AM GMT

    7లక్షల వరకూ ఎలాంటి పన్నులేదు

    • కొత్త పన్ను విధానంలో రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నులేదు.
    • GST విధానం ప్రయోజనకరంగా ఉందని 94 శాతం పారిశ్రామిక ప్రముఖులు చెప్పారు
    • ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడురెట్లు పెరిగాయి
    • పన్ను చెల్లింపుదారుల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం.

  • 1 Feb 2024 6:04 AM GMT

    కలను నిజం చేస్తాం

    • వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం
    • బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంత ఇంటి కలను నిజం చేస్తాం.
    • రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

  • 1 Feb 2024 5:57 AM GMT

    • ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది
    • జీఎస్‌టీ వంటి ట్యాక్స్‌ సంస్కరణలు ట్యాక్స్‌ పరిధిని పెంచాయి.
    • అన్నిరంగాల్లో ఆర్థికవృద్ధిని సాధిస్తున్నాం

  • 1 Feb 2024 5:52 AM GMT

     ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద ఈ పంట బీమా ద్వారా  4 కోట్ల మంది రైతులకు పంట బీమా కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 

    అదనంగా, 1361 మండిలు 3 లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవాలతో అనుసంధానించబడ్డాయి ಎಂದು ఆమె తెలిపారు

  • 1 Feb 2024 5:49 AM GMT

    • పేదలకు జన్‌ధన్‌ ఖాతాల ద్వారా రూ.34లక్షల కోట్లు అందించింది.
    • 78లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించాం
    • 2.20లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించాం

  • 1 Feb 2024 5:47 AM GMT

    • ఇంటింటికీ విద్యుత్‌, ఉపాధి, తాగునీరు సమ్మిళిత అభివృద్ధికి నినాదాలు.
    • ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు
    • గరీబ్‌, మహిళ, యువ, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం
    • 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది

  • 1 Feb 2024 5:43 AM GMT

    సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది.

  • 1 Feb 2024 5:37 AM GMT

    లోక్సభలో బడ్జెట్ ౨౦౨౪ ప్రసంగం ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 

Tags

Read MoreRead Less
Next Story