అరుదైన లోహం.. బంగారం కంటే మూడు రెట్లు అధికం

అరుదైన లోహం.. బంగారం కంటే మూడు రెట్లు అధికం
ఖలేజా సినిమాలో విలన్ ప్రకాష్ రాజ్ ఓ గ్రామాన్నే ఖాళీ చేయించాలనుకుంటాడు. దేని కోసం అంటే ఓ లోహం కోసం. ఆ లోహమే ఇప్పుడు ఈ ఏడాది జనవరి నుంచి లెక్కపెడితే 131 శాతం పెరిగిందట.

ఓ అరుదైన లోహం.. బంగారం కంటే మూడింతలు ఎక్కువ రేటు. అంతేకాదు ఈ మద్యకాలంలో బిట్‌కాయిన్‌ని మించి లాభాలు పంచింది మరోటి లేదని చెప్పుకున్నాం కదా..ఐతే దానికంటే కూడా ఇప్పుడీ లోహం మరింత ప్రియమైపోయింది. ఇంతకీ ఏంటీ లోహం అంటే ఇరీడియం.

సైన్స్ స్టూడెంట్స్‌కి అందులో పీరియాడిక్ టేబుల్ కనుక గుర్తుండి ఉంటే అందులో 192 పరమాణు భారం కలిగిన మెటల్ అంటే వెంటనే గుర్తొస్తుంది. లేదంటే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా సినిమా గుర్తుందా.. అందులో విలన్ ప్రకాష్ రాజ్ ఓ గ్రామాన్నే ఖాళీ చేయించాలనుకుంటాడు. దేని కోసం అంటే ఇరీడియం కోసమని చెప్తాడు..అదే ఆ లోహమే ఇప్పుడు ఈ ఏడాది జనవరి నుంచి లెక్కపెడితే 131 శాతం పెరిగిందట.

ఐతే ఇరీడియం ఎక్కడ పడితే అక్కడ దొరకదు. చాలా తక్కువగా మాత్రమే భూమి పొరల్లో దొరుకుతుంది. అంటే మార్కెట్ చాలా తక్కువ. మరి ఇంత రేటు ఎందుకు పెరిగిందీ అంటే, గత ఏడాది లాక్‌డౌన్ల దెబ్బకి దీని సప్లై చైన్ కూడా బాగా దెబ్బతిన్నది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది.

పైగా ప్లాటినం, పెల్లేడియం మైనింగ్‌ చేస్తే బై ప్రొడక్ట్‌(ఉత్పన్న పదార్ధం)గా మాత్రమే ఇరీడియం దొరుకుతుంది. అంతేకాదు ఎవరు పడితే వాళ్లు ట్రేడింగ్ చేసే కమోడిటీ కూడా కాదు ఎక్కడో కొంతమంది డీలర్లు మాత్రమే, మేజర్ ఇన్వెస్టర్ల కోసమే ఇరీడియం మైనింగ్ చేస్తుంటారు.

ఇరీడియం ఎక్కడెక్కడ వాడతారంటే,

ఎలక్ట్రానిక్ స్క్రీన్స్, ప్లగ్ స్పార్క్స్, రాకెట్ ఫ్యూయెల్‌లో వాడుతుంటారు. ఔన్స్ ఇరీడియం రేటెంతో తెలుసా 6వేల డాలర్లు. అంటే బంగారం కంటే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు హైబ్రిడ్ కార్లు, వెహికల్స్‌ తయారీ, వాడకంపై అందరి దృష్టీ పడటంతో ఈ రేటు ఇంకా పెరుగుతుందంటున్నారు ఎందుకంటే ఫ్యూయల్ కంబషన్‌( ఇంజన్ వెదజల్లే ఉష్ణాన్ని పీల్చడానికి) ఆటో కేటలిస్ట్‌లుగా ప్లాటినంని వాడుతున్నారు.

ఈ ప్లాటినం బై ప్రొడక్టే ఇరీడియం కూడా. అందుకే ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కనుక పెరిగితే ఇరీడియం వినియోగం కూడా పెరగకతప్పదు. ఐతే ఒరిజినల్‌గా ఇరీడియం సోర్స్ అంత తొందరగా దొరకదు కాబట్టి ఇప్పుడు ప్లాటినం గ్రూప్ మెటల్స్‌కూ డిమాండ్ పెరిగిపోయింది. పెల్లేడియం ఆల్ టైమ్‌ హై ప్రైస్‌కి 9శాతం దూరంలో, రోడియం ఔన్స్‌కి 29800డాలర్లకు ఎగశాయ్.

ఇలాంటి మెటల్స్ గురించి విన్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అంతే మరి, కొత్త టెక్నాలజీలు, భవిష్యత్ రూపాన్ని మార్చే సాంకేతికతలు వస్తున్నప్పుడు ఇలాంటి కొత్త వ్యాపార అవకాశాలు కూడా రూపుదిద్దుకోవడం సహజమే.

Tags

Read MoreRead Less
Next Story