ఎల్‌ఐసి కొత్త పాలసీ.. రక్షణతో పాటు పొదుపు

ఎల్‌ఐసి కొత్త పాలసీ.. రక్షణతో పాటు పొదుపు
Lic: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) సోమవారం మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ఇది రక్షణతో పాటు పొదుపును అందిస్తుంది.

ఎల్‌ఐసి బచత్ ప్లస్ స్కీమ్ కొత్త పాలసీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) సోమవారం మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. బచత్ ప్లస్.. ఇది రక్షణతో పాటు పొదుపును అందిస్తుంది.

ఐదేళ్ల మెచ్యూరిటీతో ఈ పాలసీ ప్రణాళిక ఉంటుంది. మరణించిన పాలసీదారుడి కుటుంబానికి మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా ఆర్థిక సహాయాన్నిఅందిస్తుంది. జీవించి ఉన్న పాలసీ హోల్డర్‌కు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి ఆ మొత్తాన్ని అందిస్తుంది అని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తెలిపింది. సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం విధానాలతో ఉంది.

పాలసీ పూర్తయిన తర్వాత పాలసీదారుడు మరణిస్తే హామీ ఇచ్చిన మొత్తం చెల్లించబడుతుంది. కనీస ప్రాథమిక మొత్తం రూ .1 లక్ష ఆపై పరిమితి లేదు. ఈ ప్లాన్ మీద రుణ సౌకర్యం కూడా ఉంది.

సింగిల్ ప్రీమియం ప్లాన్ ఆప్షన్ ఎంచుకుంటే బేసిక్ సమ్ అస్యూర్డ్ ప్రీమియంకు పది రెట్ల హామీ ఉంటుంది. ఆప్షన్ 2 అయితే ప్రీమియం కంటే ఏడు రెట్ల హామీ ఉంది. మెచ్యూరిటీ పైన గ్యారెంటీ సమ్ అస్యూర్డ్.. కనీస హామీ మొత్తం ఉంది. అయిదేళ్ల పాలసీ ముగించుకుని అన్ని ప్రీమియంలు చెల్లిస్తే అదనంగా లాయల్టీ ఉంటుంది.

ఇక బచల్ ప్లస్ సేవింగ్ ప్లాన్ వయో పరిమితి విషయానికి వస్తే సింగిల్ ప్రీమియం కోసం కనీస వయసు 90 రోజులు. ఆప్షన్‌ఏకు అయితే గరిష్ట పరిమితి 44 సంవత్సరాలు. ఆప్షన్ బీకి అయితే 70 సంవత్సరాలు. లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అయితే ఆప్షన్ 1 కు 90 రోజులు పూర్తి కావాలి. ఆప్షన్ 2కు అయితే 40 సంవత్సరాలు. గరిష్ట పరిమితి ఆప్షన్ 1కు 60 సంవత్సరాలు. ఆప్షన్ 2కు కూడా 60 సంవత్సరాలు.

సింగిల్ ప్రీమియం మెచ్యూరిటీ కనీస వయసు 18 సంవత్సరాలు. ఆప్షన్ ఏకి గరిష్ట వయో పరిమితి 65 సంవత్సరాలు. ఆప్షన్ బీకి 80 సంవత్సరాలు. లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్‌ 1కు అయితే గరిష్ట వయో పరిమితికి మెచ్యూరిటీ 75 సంవత్సరాలు. ఆప్షన్ 2కు 80 ఏళ్లు.

Tags

Read MoreRead Less
Next Story