Stock Markets : భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Markets :  భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
Stock Markets : మార్కెట్లకు ఇవాళ బ్లాక్‌ మండేగా మారిపోయింది. వరుసగా ఐదో రోజు మార్కెట్లు భారీగా కరెక్ట్ అవడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు పదిహేడున్నర లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.

Stock Markets : మార్కెట్లకు ఇవాళ బ్లాక్‌ మండేగా మారిపోయింది. వరుసగా ఐదో రోజు మార్కెట్లు భారీగా కరెక్ట్ అవడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు పదిహేడున్నర లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు అంతకంతకూ దిగజారుతున్నాయి.

ఆసియా మార్కెట్ల పతనం, దిగ్గజ షేర్లలో అమ్మకాలు..సూచీలను మరింత కిందకు లాగుతున్నాయి. ఈ పరిణామాలతో సెన్సెక్స్ ఓ దశలో 1900 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 1200 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుండగా...నిఫ్టి 350 పాయింట్ల దిగువకు పడిపోయింది. వరుసగా ఐదో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

గతవారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్‌డాక్‌ ఏకంగా ఇటీవలి గరిష్టాల నుంచి 16 శాతం దిగువకు పడిపోయింది. ఈ ప్రభావం సూచీలపై గట్టిగా పడడంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. నాస్‌డాక్‌లో టెక్‌ స్టాక్‌లు భారీ నష్టాలను చూడడం మదుపరులను ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రభావం ఐటీ సెక్టార్‌పై పడింది.

మంగళవారం అమెరికాలో ఫెడ్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్...దాన్ని ఎంత వేగంగా, ఎన్ని దశల్లో అమలు చేయనుందో భేటీలో స్పష్టం చేయనుంది. ఇదే జరిగితే మార్కెట్లపై గట్టి ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపతున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలోనూ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా లేకపోవడం మదుపరులను కలవరపరుస్తోంది.

అమెరికాలో నిరుద్యోగం పెరగడం కూడా సూచీల నష్టాలకు కారణమయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదంపైనా మదుపరులు దృష్టి పెట్టారు. గతేడాది కొత్తగా లిస్ట్‌ అయిన కంపెనీలు భారీగా నష్టాలను చూస్తున్నాయి. జోమాటో షేర్లు ఇష్యూ ధర కంటే 10 శాతం కింద ట్రేడవుతోంది. పేటీఎం షేరు ధర ఏకంగా 50 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఇక గెయినర్ల జాబితాలో సిప్లా,ONGC తప్ప మరేమి కనిపించట్లేదు.''

Tags

Read MoreRead Less
Next Story