Threads: సగానికి పడిపోయిన థ్రెడ్స్‌ వినియోగదారుల సంఖ్య

Threads: సగానికి పడిపోయిన థ్రెడ్స్‌ వినియోగదారుల సంఖ్య
Threads, Twitter, Elon Musk, Facebook, Instagram

ట్విట్టర్‌కి పోటీకి వచ్చి, కేవలం 5 రోజుల్లోనే 100 మిలియన్ల డౌన్‌లోడ్లు సాధించిన మొదటి యాప్‌గా రికార్డ్‌ సృష్టించింది థ్రెడ్స్‌ యాప్‌. మొదటి వారం రోజుల్లో సెలబ్రిటీల చేరికలు, ట్విట్టర్‌తో మాటల యుద్ధంతో ట్రెండింగ్‌లో నిలిచింది. కానీ సమయం గడిచే కొద్దీ థ్రెడ్స్‌ యాప్‌ని ఎక్కువగా ఉపయోగించే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. సుమారుగా సగానికి సగం మందికి పైగా యాప్‌ని వీడారు. చాలా మంది ట్విట్టర్‌లాగా రోజువారీగా వినియోగించడం లేదు.

ఈ నేపథ్యంలో కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాతృ కంపెనీ అయిన మెటా కంపెనీలోని ఉన్నత ఉద్యోగులకు ఈ అంశంపై దృష్టి సారించి వినియోగదారులు యాప్‌పై ఎక్కువ సమయం కేటాయించేలా, ఉన్న యూజర్లు యాప్‌ వదిలి వెళ్లకుండా కార్యాచరణ రూపొందిచాలని ప్రణాళికలు రచిస్తోంది.ఇన్‌స్టాగ్రాంలో ముఖ్యమైన థ్రెడ్స్‌ యాప్‌ సమాచారాన్ని అందించేలా ఆలోచనలు చేస్తున్నారు.


అయితే యూజర్ల నుంచి ఇటువంటి ప్రవర్తనను ముందే తెలుసని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడున్న వినియోగదారులు కంపెనీ ఊహించిన గణాంకాల కంటే మెరుగ్గానే ఉన్నట్టు వెల్లడిస్తున్నారు.

"10 కోట్ల మంది యాప్‌లోకి కొత్తగా వచ్చి చేరి అందరూ అక్కడే ఉంటే అది అందరూ కోరుకుంటారు. కానీ మేము ఇంకా ఆ స్థాయిని చేరుకోలేదు. " అని కంపెనీ సీఈవో మార్క్ జుకన్‌బర్గ్ అన్నాడు.

యాప్‌ వినియోగదారుల సంఖ్య సాధారణమే అని అభిప్రాయపడ్డాడు. యాప్‌లో ఇంకా అవసరమైన ఫీచర్లు జోడిస్తాం. డెస్క్‌టాప్ యాప్‌, మరియు యాప్‌లో సెర్చ్ ఫంక్షనాలిటీ తీసుకువస్తే యూజర్లు ఆసక్తి చూపుతారన్నాడు.

గురువారం మెటా కంపెనీ షేర్లు 8 శాతానికి పైగా దూసుకెళ్లాయి. కంపెనీ ఆదాయం, రాబడి అంచనాలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటయానే అంచనాలతో షేర్లు లాభాల్లో ముగిశాయి.

ఆగ్యుమెంటెడ్, వర్చువల్ రియాలిటీ(VR) సాంకేతికతో గత సంవత్సరం మెటావర్స్‌ సాంకేతికతపై భారీగా ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన పనులు సాగుతున్నప్పటికీ, అనుకున్నంత వేగంగా సాగడం లేదని ఉద్యోగులతో వెల్లడించాడు.

లామా-2 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను కంపెనీ ఈ నెలలో విడుదల చేసింది. దీనిని 700 మిలియన్ యూజర్స్ ఉన్న డెవలపర్స్‌ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచింది.

ట్విట్టర్ అధినేత ఎలన్‌ మస్క్‌తో ఫైట్‌ గురించి ప్రశ్నించగా.. అది ఖచ్చితంగా జరుగుతుందో లేదో చెప్పలేమన్నాడు.


Tags

Read MoreRead Less
Next Story