మారిటోరియం ఎంతపనిచేసింది : క్రెడిట్ స్కోర్లు చూసుకోండి లేదంటే..

మారిటోరియం ఎంతపనిచేసింది : క్రెడిట్ స్కోర్లు చూసుకోండి లేదంటే..
రుణాలు తీసుకుని RBI సూచనలతో చాలామంది కస్టమర్లు మారిటోరియం వినియోగించుకున్నారు. వడ్డీ భారం పడుతున్నా కోవిడ్ కష్టంలో ఆర్థికంగా వెసులుబాటు..

రుణాలు తీసుకుని RBI సూచనలతో చాలామంది కస్టమర్లు మారిటోరియం వినియోగించుకున్నారు. వడ్డీ భారం పడుతున్నా కోవిడ్ కష్టంలో ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని చాలామంది మారిటోరియం ఉపయోగించుకున్నారు. దీని వల్ల క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. కానీ అనూహ్యంగా క్రెడిట్ స్కోర్లు పడిపోయాయి. మారిటోరియం ఉపయోగించుకున్న ఓ వ్యక్తికి యావరేజ్ గా 100 పాయింట్ల వరకూ తగ్గినట్టు తెలుస్తోంది. ఇది ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. అంతా దీనిపై క్రమంగా గళం వినిపిస్తున్నారు. బ్యాంకుల నుంచి సమాచారం అందుకున్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మాత్రం సహజంగానే తగ్గిస్తూ వచ్చాయి.

వాస్తవానికి మార్చి 27న మారిటోరియం ప్రకటించిన RBI గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంగా ప్రకటించారు. మారిటోరియం వినియోగించుకున్నా వారి క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం పడదన్నారు. కానీ అనూహ్యంగా క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ భారంతో పాటు.. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ కూడా పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రుణగ్రహీతలు. అయితే దీనిపై బ్యాంకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ తగ్గడానికి ఇతర అంశాలు కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు. కొత్త లోన్ల కోసం లాగిన్ చేయడం లేదా, మారిటోరియం ఆప్షన్ తీసుకోకుండా చెల్లించకపోవడం జరిగి ఉండొచ్చని అంటున్నారు. అన్ సెక్యూర్డ్ రుణాల ప్రభావం కూడా వీటిపై అధికంగా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story