కోవిడ్ మందు తయారీకి అనుమతి కోరిన నాట్కో

హైదరాబాద్ కు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ కోవిడ్ డ్రగ్ తయారీకి అనుమతి కోరనుంది. కంపల్సరీ లౌసెన్సింగ్ విధానం కింద సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు ధరఖాస్తు చేసింది. ఇది ఎలి లిల్లీస్ కు చెందిన ఏలిమియెంట్ ఔషధానికి ఇది జనరిక్ వెర్షన్. అనుమతి వస్తే ఔషధం తయారీకి లైన్ క్లియర్ అయినట్టే. అయితే దీని వల్ల ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ పరంగా చట్టపర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
ఒల్యూమినెంట్ బ్రాండ్ మందు సాధారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లకు వాడతారు. కానీ ఎలి లిల్లీస్ కంపెనీ మందు కోవిడ్ ఇన్ఫెక్షన్ కు వాడేందుకు అమెరికా FDA అనుమతి ఇచ్చింది. నవంబర్ 19న అత్యవసర వినియోగం అంటూ అండర్ ఎమెర్జెన్సీ ఆథరైజేషన్ -EUA కింద అనుమతి ఇచ్చింది.
నాట్కో కంపెనీ కూడా బారిసిటినిబ్ బల్క్ డ్రగ్ మరియు టాబ్లెట్స్ ను దేశీయంగా తయారుచేసి మార్కెటింగ్ చేయడానికి అనుమతి కోరింది. 1 నుంచి 4 గ్రాముల వెర్షన్ లో ఇండియాతో తయారు చేస్తామంటోంది కంపెనీ. డిసెంబర్ 4న CDSCO వద్ద డేటా ప్రకారం నాట్కో కంపెనీ నవంబర్ 23నే ధరఖాస్తు చేసినట్టు తెలిపింది.
లీగల్ మరియు పేటెంట్ సమస్యలు తలెత్తకుండా కంపెనీ ప్రయత్నాల్లో ఉంది. ఓమిలియంట్ బ్రాండ్ ప్రస్తుతం ఖరీదైన మందుగా ఉంది. నాట్కో జనరిక్ వస్తే త్వరలోనే తక్కువధరకే వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com