Top

నెట్‌ఫ్లిక్స్‌ మరో ఆఫర్.. రెండు రోజులు ఫ్రీ

నెట్‌ఫ్లిక్స్‌ మరో ఆఫర్.. రెండు రోజులు ఫ్రీ
X

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ భారత వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ ప్రకటించనుంది. దేశంలోని ప్రతి ఒక్కరికీ రెండు రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ను అందించనుంది. డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఫస్ట్ ఈ ఆఫర్ కేవలం ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత కొత్త ప్లాన్‌ను ఇతర దేశాల్లో తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్రణాళికలు రచిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే 30 రోజుల ఉచిత ట్రయల్స్‌ను అందిస్తోంది. అయితే ఇటీవల అమెరికాలో 30 రోజుల ఉచిత సేవలను నెట్‌ఫ్లిక్స్‌ నిలిపివేసింది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ఈ సర్వీసు అమల్లోనే ఉంది. ఇప్పుడు దాని స్థానంలో రెండు రోజుల ఆఫర్‌ తీసుకొస్తున్నారని టాక్. ప్రమోషన్‌ ఆఫర్‌లో భాగంగా యూజర్లు 48 గంటల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వాడుకొనే వీలుంది.

Next Story

RELATED STORIES