A4 ఆడీ.. ఎంతనుకున్నారు.. ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే..

A4 ఆడీ.. ఎంతనుకున్నారు.. ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే..
ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

అప్‌డేట్ వెర్షన్‌తో ఆడీ A4 మార్కెట్లోకి వచ్చింది. ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సెడాన్‌ను ఇప్పటికి లాంచ్ చేసింది. లగ్జరీ కారు ఆడీ A4 వాహనదారులను ఆకర్షిస్తోంది. డిజైన్, ఇంటరియర్లతో ప్రత్యేకతను కనబరిచిన ఈ కారు ధర ఎక్స్ షోరూమ్‌లో రూ.42.34 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.

ఈ సరికొత్త ఆడీ ఏ4.. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాన్ని బుక్ చేసుకోవాలంటే ముందుగా రూ.2 లక్షల బుకింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

ఫీచర్లు చూస్తే.. ఫ్రంట్ వైపు హెక్సాగోనల్ గ్రిల్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లను ఏ4 ఆడి కలిగి ఉంది. వీటితో పాటు ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాపులు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు క్లస్టర్‌తో పాటు రియర్ బంపర్, డ్యూయల్ ఎక్సాహాస్ట్‌ను కలిగి ఉంది.

ఇవే కాకుండా ఆల్ డిజిటల్ వర్చువల్ కాక్‌పిట్, 10.1 అంగుళాల ఎంఎంఐ టచ్ స్కీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇంకా యాపిక్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సరికొత్త ఆడి ఏ4.. సింగిల్ 2.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 188 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేస్తుంది. ఈ వాహనం 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో అందుకుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story