టాటా టియాగో.. సరికొత్త మోడల్.. ధర చూస్తే..

టాటా టియాగో.. సరికొత్త మోడల్.. ధర చూస్తే..
ఎక్స్ షోరూంలో టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభ ధర

దేశంలో కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న సంస్థ టాటా మోటార్స్. మధ్యతరగతి వాహనాల నుంచి లగ్జరీ కార్ల వరకు ఈ సంస్థ మార్కెట్లోకి అనేక అత్యుత్తమ కార్లను విడుదల చేస్తోంది. తాజాగా తన టాటా టియాగో మోడల్లో సరికొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. ఎక్స్ షోరూంలో టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చి రూ.5.79 లక్షలు. ఈ హ్యాచ్ బ్యాక్ మిడ్ స్పెక్ ఎక్స్ టీ వేరియంట్లో సరికొత్త ఫీచర్లను పొందుపరిచారు.

అంతే కాకుండా టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ టీరియర్ 14 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు బోల్డ్ బ్లాక్ కలర్‌తో అందుబాటులోకి వచ్చింది. సరికొత్తగా మూడు పెయింట్ ఆప్షన్లను కలిగి ఉన్న టియాగో ప్లేమ్ బెడ్, పెరల్పెంట్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో లభ్యమవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో 5 అంగుళాల టచ్ స్కీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, 3 డీ నేవిగేషన్ నవీ మ్యాప్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ డిస్ ప్లే, వాయిస్ కమాండ్స్, ఇమేజ్ వీడియో ప్లే బ్యాక్ లాంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక ఇంజన్ కెపాసిటీ 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 84 బీహెచ్ ప్రీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది. స్టాండర్డ్ టియాగో ఎక్స్ టీ వేరియంట్ ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేస్తుంది. టాటా టియాగో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ సరికొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది సంస్థ.

Tags

Read MoreRead Less
Next Story