ప్లిప్ కార్ట్‌లో UPI సర్వీసులు.. ఎలా యాక్టివేట్‌ చేసుకోండి

ప్లిప్ కార్ట్‌లో UPI సర్వీసులు.. ఎలా యాక్టివేట్‌ చేసుకోండి

ఇప్పుడు డబ్బులు పంపాలంటే చేతివేళ్లతో పని. బ్యాంకుల దాకా పోవాల్సిన అవసరమే లేదు. పాపులర్ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ కూడా అదే బాటలో పయనిస్తోంది. యూపీఐ సేవల్ని ప్రారంభించింది. యాక్సిస్‌ బ్యాంకు భాగస్వామ్యంతో ఈ సర్వీసులను లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని సంస్థ తెలిపింది.

ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అన్నీ కూడా సొంతంగానే పేమెంట్ గేట్ వేల సర్వీస్ లను ప్రొవైడ్ చేస్తున్నాయి. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ అందుబాటులో ఉందని ఫిన్‌టెక్‌ అండ్‌ పేమెంట్స్‌ గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధీరజ్‌ అనెజా వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో యూపీఐ ఐడిని క్రియేట్‌ చేసుకోవడం ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. 50 కోట్ల మంది కస్టమర్లు, 14 లక్షల మంది విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు.

మరి ఏదో ఒక ఉచిత గిఫ్ట్ లేనిదే యూపీఐ యాప్ జనాలకు చేరదు కదా. అందుకే ఫ్లిప్ కార్ట్ కూడా ఓ గిప్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ ద్వారా వస్తువులు, రీఛార్జ్‌లు, పేమెంట్లు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. QR స్కాన్ చేస్తే ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ లావాదేవీలపై సూపర్‌ కాయిన్లు, క్యాష్‌బ్యాక్‌, వోచర్లు వంటి ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం రూ.100 విలువైన తొలి ఐదు క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా చెల్లింపులు చేస్తే 10 సూపర్ కాయిన్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లోని స్కాన్‌ అండ్‌ పే కిందనున్న మై యూపీఐ ఆప్షన్‌లోకి వెళ్లి యాక్టివేట్ చేసుకోండి. అనంతరం అక్కడ బ్యాంకును ఎంచుకోండి. SMS వెరిఫికేషన్‌ తహర్వా ఫ్లిప్‌కార్ట్ UPI సర్వీసు యాక్టివేట్‌ అవుతుంది. థర్డ్ పార్టీ యాప్ తో సంబంధం లేకుండా మీరు కొన్న వస్తువులకు నేరుగా ప్లిప్ కార్ట్ నుంచే చెల్లింపులు చేయండి. బయట కూడా స్కానింగ్ చేసి చెల్లింపులు చేయొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story