నడిసంద్రమున ఓ నావ! నడిపించేదెలాగ ఓ దేవా..? రోజుకు రూ.72వేలకోట్లనష్టం

నడిసంద్రమున ఓ నావ! నడిపించేదెలాగ ఓ దేవా..? రోజుకు రూ.72వేలకోట్లనష్టం
రోజుకు 72వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంటే , ఇప్పుడు ప్రపంచంలోని పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్ దగ్గర నిలిచిపోయింది ఓ కార్గో షిప్.

ఇలా ఎన్ని పాటలైనా కామెడీగా పాడుకోవచ్చు కానీ, రియల్ సిచ్యుయేషన్ అంత కామెడీగా లేదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల నష్టం.. ప్రపంచంలోని పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్ దగ్గర ఓ కార్గో షిప్ నిలిచిపోయింది. స్ట్రక్ అయిపోయిన ఈ భారీ నౌకను ఒడ్డుకు చేర్చే మార్గం ఎలాగని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వీదురుగాలులు వీచి ఈ షిప్ సూయజ్ కెనాల్‌కి అడ్డంగా నిలబడి ఆదివారానికి ఐదురోజులు గడిచిపోయాయ్. దీన్ని ఓ దారికి తీసుకురావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలీదు. ఓ సంస్థ మాత్రం ఇంకేముంది ఓ భా..రీ..క్రేన్ వచ్చేస్తుంది.. వచ్చేవారానికి తీసేస్తాం అంటోంది.. ఈలోగా ఓ రెండు టబ్ బోట్స్ రంగంలోకి దిగాయ్ కానీ, వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇంచు కూడా కదపలేకపోయాయి.

మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ మేం సాయం చేస్తాం మీరు అడిగితే అని అంటున్నారు. మా దగ్గర ఇలాంటి చిక్కు సమస్యలకు పరిష్కారాలు, ఎవరి దగ్గరా లేని పనిముట్లు ఉన్నాయి, ఈజిప్ట్ ప్రభుత్వం అడిగితే సాయం చేస్తామంటూ జో బైడెన్ సెలవిచ్చారు.

సూయజ్ సిటీకి దగ్గర్లో సింగిల్ లేన్ స్ట్రెచ్ కెనాల్ దగ్గర వేల కిలోమీటర్ల ఇసుకలో చిక్కుకుపోయిన ఈ ఓడ.. ఆ దారిలో మూడున్నర మైళ్ల దూరంలో సాగించే వ్యాపారాన్ని, ఓడలను బ్లాక్ చేసింది. దీంతో గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతిన్నది. ఈస్ట్ వెస్ట్‌ జలమార్గంలో అంతర్జాతీయ షిప్పింగ్‌కి ఈ మార్గం కీలకం, ఆసియా నుంచి యూరప్ వాణిజ్యానికి దగ్గర దారి. ఆఫ్రికా నుంచి సినాయ్ పెనిన్సులా మధ్యలో ఉన్న ఈ కెనాల్‌లో చిక్కుకుపోయిన ఎవర్ గ్రీన్ అనే పనామా షిప్పింగ్‌కి చెందిన నౌకని కదల్చలేని పరిస్థితిలో ఉన్నారు అధికారులు. ఇక చేసేదిలేక డ్రెడ్జింగ్‌కూడా సిద్ధమవుతున్నట్లు ఒసామా రాబేయ్ అని ఆ కంపెనీ ప్రతినిధి చెప్పుకొస్తున్నారు. పోనీ ఓడలోని కంటైనర్లను దింపేస్తే కాస్త బరువు తగ్గుతుందని భావించినా, భారీగా వీస్తోన్న గాలులతో ఆ ప్రయత్నం కూడా విఫలమవుతోంది. ఈజిప్ట్ ప్రధాని ముస్తాఫా మేడ్బౌలీ.. కంటైనర్లను, కార్గోని దింపేసే ప్రయత్నం చేస్తామంటూ ముందు ప్రకటించారు.

కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం..

ఏమో చెప్పలేం. ముందు ఇంజన్ ఫెయిల్యూర్ ఏమాత్రం జరగలేదని చెప్పారు, కానీ మధ్యలో పవర్ బ్లాక్ అవుట్ ప్రయత్నాలు జరిగాయని విన్పించింది. ఐతే ఇంత పెద్ద భారీ నౌక అడ్డంగా పడిపోవడాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదు. విచారణ జరుగుతోంది అని అధికారులు పేర్కొన్నారు.

మరిప్పుడేంటి దారి

ఈ దారిలో వస్తోన్న కార్గో షిప్స్ కొన్ని దారి మళ్లించుకున్నాయ్. గత ఏడాది మొత్తం 19000 వెజెల్స్ ఈ దారిలో ప్రయాణం చేసాయ్. ఇదే దారిలో ఆయిల్ అండ్ గ్యాస్ షిప్‌మెంట్స్ యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్తుంటాయ్. అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రబ్ అయ్యాయ్. కంపెనీ చెప్తున్నట్లు వచ్చేవారంలో వచ్చే బారీ క్రేన్‌తో ఓడ కదిలినా, ఇప్పటికిప్పుడు ఈ సప్లై చైన్ గాడిలో పడదు. కనీసం మరో వారం షిప్‌మెంట్స్ ఆలస్యం అవుతాయన్నది ఎక్స్‌పర్ట్స్ అంచనా. మరి ఎవర్‌గ్రీన్ షిప్‌ కదిలేదెప్పుడు, అందులో ఉన్న లక్ష టన్నుల సరుకు రవాణా అయ్యేదెప్పుడు, డెలివరీ అయ్యేదెప్పుడు..?

Tags

Read MoreRead Less
Next Story