పేటీఎం గుడ్ న్యూస్.. 2 నిమిషాల్లో రూ.2 లక్షల లోన్

పేటీఎం గుడ్ న్యూస్.. 2 నిమిషాల్లో రూ.2 లక్షల లోన్
ఇప్పుడు ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు, ఫ్రోఫెషనల్స్‌కు లోనే సేవలు తక్షణమే అందించేందుకు ముందుకు వచ్చింది.

ఏ చిన్న వ్యాపారం చేయాలన్నా కనీసం లక్షా, రెండు లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఎవరిస్తారు అని ఎదురు చూడక్కరలేదు. పేటీఎం యాప్‌తో నగదు లావాదేవీలు జరిపే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రెండు నిమిషాల్లో రూ.2 లక్షల వరకు తక్షణమే లోన్ సౌకర్యం అందిస్తోంది. ఈ లోన్ సేవలు 365 రోజులు అందుబాటులో ఉంటాయి.

సెలవులైనా, వారాంతాలైనా లోన్ సౌకర్యాన్ని పొందొచ్చు. ఎన్బీఎఫ్‌సీలకు పేటీఎం ఇప్పటికే టెక్నాలజీ, డిస్ట్రిబ్యూషన్ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు, ఫ్రోఫెషనల్స్‌కు లోనే సేవలు తక్షణమే అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు లోన్లు తీసుకోని వారికి పేటీఎం ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ ఉపయోగపడుతుంది.

పేటీఎం ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. లోన్ అప్లికేషన్, మంజూరు కోసం ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. అంతా డిజిటల్ రూపంలో ఉంటుంది. రెండు నిమిషాల్లోనే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు లోన్ మంజూరు చేస్తాయి. చిన్న నగరాలు, పట్టణాల్లో ఉండేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

18 నుండి 36 నెలల కాలపరిమితి లోన్ అప్రూవల్ క్రెడిట్ స్కోర్, కస్టమర్ కొనుగోలు ప్యాటర్న్ పైన ఆధారపడి ఉంటుంది. కస్టమర్ తాను తీసుకున్న లోన్ మొత్తాన్ని 18 నెలల నుండి 36 నెలల్లోపు చెల్లించాలి. ఈ పర్సనల్ లోన్‌కు అర్హత ఉన్నవారు పేటీఎంలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

లోన్ అకౌంట్‌ను కూడా పేటీఎం యాప్ ద్వారా నిర్వహించవచ్చు. పేటీఎం ఈ సేవల కోసం పలు ఎన్బీఎఫ్‌సీలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బీటీ దశలోనే 400 మంది సెలెక్టెడ్ కస్టమర్లకు పర్సనల్ లోన్ జారీ చేసింది. ఏడాదికి 10 లక్షల మందికి లోన్ ఇవ్వాలని పేటీఎం టార్గెట్ పెట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story