petrol: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ ధర..

petrol: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ ధర..
దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇప్పటికే చుక్కలను తాకుతున్న పెట్రో, డీజిల్ ధరలను చమురు సంస్థలు శుక్రవారం మరోసారి పెంచాయి.

petrol: దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఇప్పటికే చుక్కలను తాకుతున్న పెట్రో, డీజిల్ ధరలను చమురు సంస్థలు శుక్రవారం మరోసారి పెంచాయి. నేడు లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెరిగింది. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102 దాటింది. డీజిల్ ధర ముంబైలో రూ.94.14కి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.85 ఉంటే డీజిల్ ధర రూ.86.75గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధర రూ.100కు చేరువైంది.

ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లద్ధాఖ్‌లోని చాలా ప్రాంతాల్లో పెట్రో ధర వందకు చేరువైంది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో ఏకంగా రూ.106.94కు చేరుకుంది. దేశంలో ఇదే అత్యధికం. ఇక డీజిల్ ధర కూడా అక్కడ దాదాపు అదే రేటుకు చేరుకుంది. మే 4 నుంచి ఇంధన ధరలు వరుసగా పెరురుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి 23 సార్లు ధరలను సవరించగా, పెట్రోల్ ధర రూ.6 వరకు పెరిగింది. వ్యాట్, స్థానిక పన్నులను బట్టి చమురు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి.

ప్రధాన నగరాల్లో లీటర్ ఇందన ధర..

దిల్లీ: పెట్రోల్ రూ.95.85 కాగా, డీజిల్ రూ.86.75

ముంబయి: పెట్రోల్ రూ.102.04, డీజిల్ రూ.94.15

కోల్‌కతా: పెట్రోల్ రూ.95.80, డీజిల్ రూ.89.60

చెన్నై: పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.91.42

హైదరాబాద్: పెట్రోల్ రూ.99.62, డీజిల్ రూ.94.57

Tags

Read MoreRead Less
Next Story