ఇక దేశంలోకి ఫారిన్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వచ్చేస్తాయా..?

ఇక దేశంలోకి ఫారిన్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వచ్చేస్తాయా..?
బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్ పాస్ అయిపోయింది

రాజ్యసభలో గురువారం సాయంత్రం బీమారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్ పాస్ అయిపోయింది. దీంతో ఇక ఇది చట్టంగా మారినట్లే. ఐతే కీలకంగా ఉండే నిర్వహణ బాధ్యతలు, డైరక్టర్లు మొత్తం భారతీయులే ఉండాలి. అంతే కాదు కొత్త స్ట్రక్చర్ ప్రకారం, 50శాతం డైరక్టర్లు ఇండిపెండెంట్ హోదాలో ఉండాలి అలానే కంపెనీ లాభాల్లో కొంత నిర్దేశిత మొత్తంలో రిజర్వ్‌ ఫండ్‌లాగా ఉంచేయాలి.

అలానే కంట్రోల్ ఎవరి కింద ఉంటుందనే ప్రశ్నకి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కంట్రోల్ అంటే.. మెజారిటీ డైరక్టర్ల నియమించే హక్కు, అలానే మేనేజ్‌మెంట్ టాప్ అఫిషియల్స్ అందరూ కూడా భారతీయులే ఉంటారని చెప్పారు. అలానే ఏ కంపెనీ కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ భారత్‌ కాకుండా ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేదు. అలానే 74శాతానికి పరిమితి పెంచాం కదాని ప్రతి కంపెనీ అలా పెంచమని కాదని విదేశీ కంపెనీలను ఆహ్వానించే ముందు అది అవసరమా కాదా అనేది ఆయా బీమా కంపెనీలు ఆలోచించుకోవాలంటూ సూచించారామె.

ఇప్పటిదాకా 49శాతం మాత్రమే ఉన్న ఎఫ్‌డిఐ లిమిట్, బీమారంగంలో 74శాతానికి పెంచడంతో ఇక కొత్త రకమైన పాలసీలు, వినియోదారులకు ఉపయోగపడే పాలసీలు, రైడర్లతో కలిసిన బెనిఫిట్స్ వస్తాయేమో చూడాలి. సంప్రదాయబద్దంగా ఉన్న ఎల్ఐసి కాకుండా, దేశంలో పలు రకాల బీమా కంపెనీలు ఉన్నాయి. కొత్తగా విదేశీ నిధులు కూడా ఈ రంగంలోకి రానుండటంతో, ఇన్సూరెన్స్ పాలసీల రూపకల్పన ఏదైనా మారుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న లిస్టెడ్ కంపెనీలైన కోటక్, ఆదిత్యబిర్లా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్,ఏఎంసి, ఐసిఐసిఐ లంబార్డ్ వంటి మేజర్ ప్లేయర్లు ఈ కొత్త మార్పును అందిపుచ్చుకుంటాయనే అంచనాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story