వీళ్ల ఒక్కరోజు సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వీళ్ల ఒక్కరోజు సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వీళ్లు రోజుకు రూ.18.4కోట్లు సంపాదించారు.

ఇండియన్ వారెన్ బఫెట్, ఏస్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రాకేష్ ఝన్ ఝన్ వాలా, ఆయన భార్య రేఖా కలిసి రోజుకు స్టాక్ మార్కెట్లో రూ.18.4కోట్లు సంపాదించారు.

NCC స్టాక్స్ 11 రోజుల్లో భారీగా పెరిగింది. ఈ కంపెనీలో రాకేష్ ఆయన భార్యకు కలిపి 7.83 కోట్ల షేర్లున్నాయి. జనవరి 29న కంపెనీ స్టాక్ 58.95 వద్ద ఉంది. ప్రజంట్ ఇది రూ.84.95 వద్ద ఉంది.

ఈ 11 సెషన్లలో వీటి వాల్యూ రూ.461.77 కోట్ల నుంచి 664.26 కోట్లుకు పెరిగింది. అంటే వీళ్ల ప్రాఫిట్ రూ.202.49 కోట్లు. ఇదంతా కేవలం11 రోజుల్లో పెరిగింది. అంటే రోజుకు రూ.18.4 కోట్లు.

గత 11 ట్రేడింగ్ సెషన్లలో ఎన్‌సిసి లిమిటెడ్ షేర్ ధర 43.85% పెరిగింది. ఇప్పటి వరకు, ఎన్‌సిసి లిమిటెడ్ షేర్ ధర గత ఏడాదిలో 81.58% పెరిగింది మరియు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 47.88% పెరిగింది. ఒక నెలలో, స్టాక్ 37.39% పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story