ప్రేమతో భార్యని.. రిస్క్‌తో మార్కెట్లో డబ్బుని: రాకేష్ చెప్పిన సక్సెస్ మంత్ర

ప్రేమతో భార్యని.. రిస్క్‌తో మార్కెట్లో డబ్బుని: రాకేష్ చెప్పిన సక్సెస్ మంత్ర
విమెన్ విత్ లవ్... మార్కెట్ విత్ రిస్క్.. ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే.. టైమ్స్ ఆఫ్ ఇండియా సమ్మిట్లో రాకేష్ చెప్పిన సక్సెస్ మంత్ర

స్టాక్ మార్కెట్లో సక్సెస్ ఊరికే రాదు.. ఎంతో కష్టం.. మరెంతో అవగాహన.. అంతకుమించి రిస్క్.. అన్నింటికి మించి సహనం ఉండాలి. అప్పుడే మార్కెట్ నిన్ను గుర్తిస్తుంది.. నీకు లాభాల పంట పండిస్తుంది. ఎమోషన్స్ తో పోతే.. నిండా ముంచుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లో అందరికీ ఆదర్శంగా నిలిచే ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా ఇదే విషయం మరోసారి స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా సమ్మిట్లో ఆయన మార్కెట్ పై తనఅభిప్రాయాలు.. ఇన్వెస్టర్లకు అవసరమైన సలహాలు పంచుకున్నారు..

ఇంతకీ ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...

నేనే రిస్క్ తీసుకునే వ్యక్తిని.. నాకు రిస్క్ అనేది హాబిట్ గా మారింది. అయితే అప్రమత్తంగా ఉండాలి... నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఊహించని అధ్బుత అవకాశాలు కల్పిస్తుంది. అదేసమయంలో మీరు తప్పులు చేస్తే కాపాడేవాళ్లు కూడా ఉండరు.

నాకు 20 ఈక్విటీ ఇన్వెస్టిమెంట్స్ ఉన్నాయి. అందులో 10 డడ్స్. 5 మోడరేట్ గా వర్కువట్ అయ్యాయి. మరో 5 బ్యూటిఫుల్ గా వర్కువుట్ గా అయ్యాయి. నేను చాలావరకు పెట్టుబడులు చిన్న కంపెనీల్లోనే పెడుతుంటాను. మెట్రోలో 2006లో ఇన్వెస్ట్ చేశాను.. Concorలో 2009లో పెట్టుబడి పెట్టారు. Metroలో పెట్టుబడి పెట్టిన సమయంలో దీని టర్నొవర్ కేవలం రూ.60-80 కోట్లు మాత్రమే. కానీ గడిచిన ఏడాది ఇది రూ.1400 కోట్లు. అంటే కంపెనీతో పాటు.. నా షేర్లు, సంపద కూడా పెరిగింది. దీనికి కావాల్సింది సహనం. ముందుచూపు.

దీర్ఘ కాలిక పెట్టుబడులపై నా ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. వాటి చుట్టూనే నా ఆలోచనలుంటాయి. నాకు సహనం ఎక్కువే. అవకాశం చూసి.. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తు కోసం చూస్తాను. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతాను. ఇక్కడ జడ్జ్ చేయడం అత్యంత కీలకం.

కొన్నిసార్లు స్గ్రగుల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా Star Health కంపెనీతో డీల్ నాకు సవాలుగా మారింది. వాస్తవానికి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు సాహసించి ఉండరు. కానీ నేను డేర్ చేశాను. కంపెనీకి చాలా సమస్యలున్నాయి. వీటిని అధిగమించడానికి 18 నెలల సమయం పట్టింది. ఫలితం సాధించాను.

ఎప్పుడూ కూడా ట్రెండ్ తో పోవద్దు. ట్రెండ్ అప్ వర్డ్. మీరు అవకాశం కోసం చూడండి. కంపెనీ ఫ్యూచర్ చూడండి. ఛాన్స్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోండి. నా విషయంలో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటా. నాకు పార్టనర్స్ ఎవరూ లేరు. నేను నా భార్య. నా భార్య ఎప్పుడు ఏమీ అడగదు. అందుకే నిర్ణయం నాదే. ఇన్వెస్టర్ గా బాధ్యత మనదే.. అంతిమంగా పలితం మనకే.

నేనో విషయం చెబుతాను..జీవితంలో నా వరకు రెండు ఆసక్తికర అంశాలుంటాయి. ఒకటి విమెన్.. రెండు మార్కెట్. విమెన్ విత్ లవ్. మార్కెట్ విత్ రిస్క్. రెండు సక్సెస్ అయ్యాయి. ప్రేమతో భార్య.. రిస్క్ తో మార్కెట్లో డబ్బు వచ్చింది. అవును నేనుమార్కెట్లోకి రూ.5000 తో వచ్చాను. రిస్క్ తీసుకున్నాను... ప్రతిసారీ విజయం సాధించాను. కొన్ని సార్లు నష్టాలను చూశాను. కానీ రిస్క్ చేయడం హాబిట్ గా మారింది. నా భార్య చేతిగాజులు అమ్మడానికి కూడా నేను వెనకాడలేదు. కాకపోతే నమ్మకం.. భవిష్యత్తు చూసి డేర్ చేస్తూ వచ్చాను.

రాబిన్ హుడ్ ఇన్వెస్టర్లకు చెప్పేది ఏమంటే.. స్టాక్ మార్కెట్ రేస్ కోర్స్ కాదు. మార్కెట్లో డబ్బు వస్తుంటుంది.. పోతుంటుంది.. వాటిని సరిగ్గా అంచనా వేసి ఇన్వెస్ట్ చేయాలి. మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయడం ఎంతముఖ్యమో.. వాటిని అనుభవం ఉన్న వ్యక్తుల చేతిలో పెట్టడం కూడా అంతే అవసరం. మ్యూచువల్ ఫండ్స్, ఫండ్స్ మేనేజర్ ఎవరైనా సరే వారి గురించి పూర్తిగా తెలుసుకుని అప్పగించండి. వాటి పట్ల అవగాహన పెంచుకోండి. మరీ ముఖ్యంగా మీడబ్బును మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.. మీ మామగారిది.. మా నాన్నగారి కష్టార్జితం అసలు మార్కెట్లో పెట్టవద్దు.

జీవితంలో నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. ఇంకా మంచి అలవాట్లతో మంచి మనిషిగా బతకాలని కోరుకుంటున్నా...

ఇది సమ్మిట్ లో ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్ ఝన్ వాలా వెల్లడించిన అంశాలు.

Tags

Read MoreRead Less
Next Story