మారిటోరియం పెంపు లేనట్టే?
మారిటోరియం కొనసాగించే ఉద్దేశం RBI కి లేదని తెలుస్తోంది.

కొవిడ్ పేండమిక్ నుంచి వ్యక్తులను, సంస్థలను ఆదుకునేందుకు బ్యాంకు రుణాల EMI చెల్లింపులపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మారిటోరియం విధించింది. ముందుగా మార్చి నుంచి మే నెల వరకు మారిటోరియం అమలు చేశారు. అయితే తీవ్రత తగ్గకపోగా... మరింత విస్తరిస్తుండటంతో ఆగస్టు 31వరకు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ గడువు కూడా ఈ నెలతో ముగుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో మారిటోరియం పొడగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలున్నాయి. HDFC ఛైర్మన్ దీపక్ పరేక్, కోటక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కోటక్ ఇప్పటికే అభ్యంతరాలు తెలుపుతూ రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. మారిటోరియం ఎక్కువకాలం ఉంచడం వల్ల పేమెంట్ హాబిట్ మార్పు వస్తుందని... ఇది అంతిమంగా బ్యాంకుల్లో NPAలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు.
అయితే ఇటీవల RBI ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మారిటోరియం అనేది స్వల్పకాలికంగా ఊరట మాత్రమేనని.. కొంతకాలం పాటు వారికి రిలీఫ్ ఉండేలా ఆలోచనలు చేస్తున్నామని ప్రకటించింది RBI. ఇప్పటికే కంపెనీలకు రుణాల రీస్ట్రక్చర్ ప్లాన్ అమలు చేస్తోంది. త్వరలో వ్యక్తిగత రుణాలపైనా కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే మారిటోరియం కాకుండా.. ఇతర మార్గాల్లో వారికి అటు బ్యాంకులు, ఇటు ఖాతాదారులకు ఇరువురికి నష్టం లేకుండా కొత్త స్కీము వచ్చే అవకాశం ఉంది. మారిటోరియం కొనసాగించే ఉద్దేశం RBI కి లేదని తెలుస్తోంది.
RELATED STORIES
China Corona: చైనా రాజధానిలో మళ్లీ లౌక్డౌన్.. ఇప్పటికే పలు జిలాల్లో...
23 May 2022 4:15 PM GMTUkraine: మరియుపూల్ తర్వాత లుహాన్స్క్ ప్రాంతంపై రష్యా దృష్టి..
23 May 2022 3:45 PM GMTKTR: లండన్లో కేటీఆర్ పర్యటన.. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
18 May 2022 4:15 PM GMTNorth Korea: ఒక్కరోజే 2 లక్షల 70 వేల కోవిడ్ కేసులు.. కిమ్ రాజ్యంలో...
18 May 2022 9:45 AM GMTCrisis in Sri Lanka: శ్రీలంక ఎయిర్ లైన్స్ ను అమ్మేస్తాం: ప్రధాని
17 May 2022 1:00 PM GMTElisabeth Borne : ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
17 May 2022 2:30 AM GMT