Reliance: దూసుకుపోతున్న రిలయన్స్ షేర్లు, JIO ఫైనాన్సియల్ డీమెర్జర్

Reliance: దూసుకుపోతున్న రిలయన్స్ షేర్లు, JIO ఫైనాన్సియల్ డీమెర్జర్
ఎన్‌ఎస్‌ఈలో ఇక నిఫ్టీ-50లో 51 షేర్లు, బీఎస్‌ఈలో 31 షేర్లు ఉండనున్నాయి.

రిలయన్స్ జియో ఫైనాన్సియల్(Jio Financial Services) షేర్లు రిలయన్స్ నుంచి విడిపోయి ప్రత్యేక షేర్లుగా మార్కెట్‌లో ట్రేడ్ అవనున్నాయి. కొత్త షేర్ల ధరను 261.85గా లెక్కగట్టారు. షేర్ల ధరలను లెక్కగట్టడానికి ముందు NSEలో రిలయన్స్ షేర్ల ప్రీ ఓపెన్ సెషన్(Pre Open Session) నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య నిర్వహించిన ఈ ప్రత్యేక సెషన్‌లో 2853 వద్ద క్లోజ్ అయింది. అంతకు ముందు రోజు 2580 వద్ద ముగిసింది. ఈ రెండు ధరల మధ్య వ్యత్యాసం లెక్కించి కొత్త షేర్లకు లెక్కగట్టారు. జియో ఫైనాన్సియల్ షేర్లు వచ్చే 2-3 నెలల్లో సూచీల్లో ట్రేడవనున్నాయి.

ఎవరికి ఎన్ని షేర్లు

షేర్లను 1:1 నిష్పత్తిలో విభజించారు. అంటే 1 రిలయన్స్ షేర్ కలిగి ఉన్నవారికి కొత్త షేర్లలో 1 షేర్ లభించనుంది. జులై 20 నుంచి రికార్డ్ తేదీగా నమోదైంది. అంటే జులై 20 వరకు రిలయన్స్ షేర్లు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్లలో వాటాలు లభించనున్నాయి.

డీమెర్జర్‌పై ప్రకటన చేసిన రోజు నుంచీ రిలయన్స్ షేర్లు లాభాల పంట పండిస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఈ నెల 8న ఒక రిలయన్స్ షేర్‌కి జియో ఫైనాన్సియల్ షేర్లను ఇస్తామని ప్రకటించడంతో ఆల్‌టైం గరిష్ఠాల్ని తాకుతూ వస్తోంది.బుధవారం గరిష్ఠస్థాయిలో 2853కి చేరి కొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ రూ. 19.30 లక్షల కోట్లకు చేరుకుంది.

ఎన్‌ఎస్‌ఈలో ఇక నిఫ్టీ-50లో 51 షేర్లు, బీఎస్‌ఈలో 31 షేర్లు ఉండనున్నాయి. విభజించబడిన ఈ జియో ఫైనాన్సియల్ షేర్లు నిఫ్టీ-100, నిఫ్టీ-200, నిఫ్టీ-500, ఇతర రంగాల షేర్లలో కూడా ఉండనుంది.

ఈ డీమెర్జర్‌ ఖర్చును రిలయన్స్ ఇప్పటికే వెల్లడించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి 95.32 శాతం వ్యయం అవనుండగా, మిగిలిన 4.68 శాతం జియో ఫైనాన్సియల్ సర్వీసెస్‌కి అవనుంది.

Tags

Read MoreRead Less
Next Story