ఏటీఎంలలో నగదు కొరతపై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం..!
ఏటీఎంలలో నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల్లో నగదును సకాలంలో నింపని బ్యాంకులపై జరిమానా విధించనున్నట్లు వెల్లడించిది.

ఏటీఎంలలో నగదు కొరతను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల్లో నగదును సకాలంలో నింపని బ్యాంకులపై జరిమానా విధించనున్నట్లు వెల్లడించిది. ఏదేని నెలలో మొత్తం 10 గంటలు పాటు ఏటీఎంల్లో నగదు లేని పక్షంలో సంబంధిత బ్యాంకుపై 10 వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. బ్యాంకు ఖాతాదారులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.
RELATED STORIES
Viral Video: ఆకతాయి అల్లరి.. సింహం నోట్లో వేలు పెట్టాడు.. ఆ తర్వాత..
23 May 2022 12:45 PM GMT'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది:...
20 May 2022 10:00 AM GMTBhubaneswar : పెళ్ళికి సైకిల్ పై వరుడు.. ఎందుకంటే..!
20 May 2022 5:30 AM GMTOdisha : పెళ్ళికి నో అన్న వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు
19 May 2022 3:15 PM GMTBengaluru: స్కూల్ విద్యార్థినుల ఘర్షణ.. బాయ్‌ఫ్రెండ్ కోసమే అంటూ...
18 May 2022 11:15 AM GMTKarnataka : మహిళా లాయర్ పై విచక్షణారహితంగా దాడి.. వీడియో వైరల్
16 May 2022 3:30 AM GMT