RBI: రూ.2000 నోటుపై ఆర్బీఐ..

RBI: రూ.2000 నోటుపై ఆర్బీఐ..
ఆర్బీఐ క్రమ క్రమంగా ఈ నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకోవాలని భావిస్తోంది.

RBI: ఇప్పటికే 2వేల నోటు చెలామణి తగ్గిపోయింది. గత రెండేళ్లుగా ఈ నోట్లను ముద్రించడం నిలిపివేసింది ఆర్బీఐ. క్రమ క్రమంగా ఈ నోట్లను సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించుకోవాలని అనుకుంటోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.57.757 నోట్ల విలువ గల రూ.2000 నోట్లు మార్కెట్ లో చలామణి నుంచి మాయం అయ్యాయని ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడించింది.

దాదాపు నాలుగేండ్ల క్రితం రద్దైన పాత పెద్ద నోట్ల స్థానంలో రూ.2000 నోట్లను కేంద్రం చలామణిలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి రూ.2000 విలువైన నోట్ల చలామణిని తగ్గించాలని కేంద్రం, ఆర్బీఐ భావించాయి.

కోవిడ్ మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని తెలిపింది.

దీంతో బ్యాంకు నోట్లకు డిమాండ్ ఎక్కువైనట్లు ఆర్బీఐ పేర్కొంది. డిమాండ్ కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని కరెన్సీ నిల్వలు సరిపడా ఉండేలా చూసుకున్నామని వివరించింది.

కొత్త నోట్ల ముద్రణ కోసం గత ఏడాది రూ.4012 కోట్లు ఖర్చుచేశామని తెలిపింది. ప్రస్తుతం రూ.500, రూ.200, అంతకంటే తక్కువ విలువ నోట్ల ముద్రణ పెంచామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story