Samsung Galaxy M34 5G: రూ.20 వేల లోపే అదిరిపోయే ఫోన్‌

Samsung Galaxy M34 5G: రూ.20 వేల లోపే అదిరిపోయే ఫోన్‌
గెలాక్సీ M 34ను అందుబాటులోకి తెచ్చిన శాంసంగ్‌.. రూ.20 వేల లోపే అందుబాటులోకి 5జీ ఫోన్‌.... జులై 15నుంచి అమ్మకాలు ప్రారంభం...

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్‌కు ఇండియాలో మంచి డిమాండ్‌ ఉంటుంది. లేటెస్ట్‌ ఫోన్లను ఎప్పుడు లాంచ్‌ చేస్తారా అని కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే సంస్థ కూడా కొత్త కొత్త ప్రాడక్ట్స్‌ను తీసుకొస్తుంటుంది. ఇప్పుడు శామ్‌సంగ్‌ కొత్త 5జీ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.విజయవంతమైన M’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిది. గెలాక్సీ M 34.. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది తీసుకొచ్చిన M 33కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను విడుదల చేసింది. బిగ్‌ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్‌ ధర రూ.20 వేలలోపే ఉండడం విశేషం. ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో సెన్సార్ కూడా ఉంది. ముందు వైపు ఉన్న 13 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా మంచిగా సెల్ఫీలు తీసుకోవచ్చు.


శాంసంగ్‌ M 34 5జీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.16,999, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999గా పేర్కొంది. ప్రారంభ ఆఫర్‌ కింద బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని ఈ ధరగా కంపెనీ పేర్కొంది.


రూ.999తో ప్రీ బుక్‌ చేసుకుంటే 25W అడాప్టర్‌ ఉచితంగా పొందొచ్చని సామ్‌సంగ్‌ కంపెనీ పేర్కొంది. లాంచింగ్‌ ఆఫర్‌ తర్వాత ధర ఎంతుంటుంది అనేది కంపెనీ వెల్లడించలేదు. మిడ్‌నైట్‌ బ్లూ, ప్రిజమ్‌ సిల్వర్‌, వాటర్‌ ఫాల్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. జులై 15 నుంచి అమెజాన్‌లో ఈ మొబైల్‌ అందుబాటులో ఉండనుంది. జులై 15, 16 తేదీల్లో అమెజాన్‌ నిర్వహించే ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్‌ ఇవే....

ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత వన్‌యూఐ 5తో పనిచేస్తుంది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఇందులో ఎగ్జినోస్‌ 1280 ప్రాసెసర్‌ను అమర్చారు. ట్రిపుల్‌ కెమెరా సపోర్ట్‌ ఉంది. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ముందు వైపు సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరా ఉంటుంది. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం జాక్‌, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, డాల్బీ అట్మాస్‌ వంటివి ఉన్నాయి. ఇందులో 6000ఎంఏహెచ్ ఇస్తున్నారు. సింగిల్‌ ఛార్జ్‌తో రెండ్రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఇస్తుందని కంపెనీ చెప్తోంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌తో పాటు ఛార్జింగ్‌ అడాప్టర్‌ ఇవ్వడం లేదు. కావాలనుకునే వారు దీన్ని సపరేట్‌గా కొనుగోలు చేయాలి. ఒకవేళ ప్రీ బుక్‌ చేసుకుంటే ఉచితంగా లభిస్తుంది. కార్నరింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది. డిస్‌ ప్లేలో వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ కూడా వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story