వినియోగదారులకి SBI హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేకుంటే..!

వినియోగదారులకి SBI హెచ్చరిక.. వెంటనే ఇలా చేయండి.. లేకుంటే..!
మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలని.. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

తమ కస్టమర్లకి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా హెచ్చరిక జారీ చేసింది. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలని.. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకుంటే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందొచ్చని తెలిపింది. ఏదైనా సబ్సిడీ రావాల్సి ఉంటే వెంటనే బ్యాంక్ ఖాతాలోకి వస్తుందని పేర్కొంది.

లేకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టం అవుతుందని పేర్కొంది. అయితే ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌ను లింక్ చేయడానికి మొత్తం నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే..ఎస్‌బీఐ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, బ్యాంక్ బ్రాంచ్‌ ద్వారా రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఆధార్ నెంబర్‌‌‌‌‌తో బ్యాంక్ అకౌంట్‌‌‌‌ను లింక్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.


Tags

Read MoreRead Less
Next Story