ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్

ఎస్‌బీఐ మాగ్నమ్ చిల్డ్రన్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్

చిన్నారుల భవిష్యత్తు విషయంలో ఎంతో జాగ్రత్తతో ఉంటారు. సందేహం లేదు. ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా పక్కాగా ఉంటుంది. ఇందులో భాగంగా మీకోసం SBI కొత్తగా మ్యూచువల్ ఫండ్ ప్లాన్ తీసుకొచ్చింది. SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెన్ ఫిట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ పేరుతో వచ్చింది. సెప్టెంబర్ 8 నుంచి 22 మధ్య ఓపెన్ ఆఫర్ చేస్తుంది. మరి నిజంగా ఇది వర్తీయేనా.. ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చా చూద్దాం..

ఈ చిల్గ్రన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ లో 65శాతం డొమస్టిక్ మార్కెట్లో పెడుతుంది. మిగిలిన 35శాతం ఇంటర్నేషనల్ ఈక్విటీస్ మరియు గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. లాక్ పిరియడ్ 5ఏళ్లు. లేదంటే మీ పిల్లల వయసు 18 వచ్చేవరకు... ఏది ముందు అయితే అదే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ స్కీములో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మైనర్ పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి. లేదా మైనర్ తో కలిసి జాయింట్ అకౌంట్ అయినా ఉండాలి. గతంలో సేవింగ్ ప్లాన్ 2002లోనే స్టార్ట్ చేసింది. అయితే దీనికి ప్రస్తుతం వచ్చిన ప్లాన్ పూర్తి భిన్నమైనది.

SBIలో ప్రస్తుతం ఈక్విటీ డెబిట్ రెండు చిల్ట్రన్ ఫోకస్ ప్లాన్లు ఉన్నాయి. తమ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేసేవారికి ఇది ఖచ్చితంగా మేలు చేస్తుందన్నది నిపుణులు అభిప్రాయం. ఇలాంటి ఫండ్ వల్ల పెద్దలు ఇన్వెస్ట్ చేయడం అలవాటుగా మారుతుంది. ఖచ్చితంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ విధానం అలవడుతుంది. SBI కూడా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.. AAA,AA రేటెడ్ కంపెనీల బాండ్లపై మాత్రమే ఇన్వెస్ట్ చేయనుంది కాబట్టి బెటర్ రిటర్న్ర్ అవకాశం ఉంది. అయితే ఫస్ట్ టైం ఈ తరహా ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ కాబట్టి.. SBI ఎలా మేనేజ్ చేస్తుందన్నది పెద్ద డ్రాబ్యాక్ అంటున్నారు మార్కెట్ నిపుణులు. సాధారణంగా అనుభవమే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్లకు కీలకం. కానీ దీనికి ఈ విభాగంలో అనుభవం లేదు. ముఖ్యంగా చిల్ట్రన్ ప్లాన్ HDFC, UTI లకు మాత్రమే ప్రస్తుతం చిల్ట్రన్ ప్లాన్స్ ఉన్నాయి.

అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్లాన్లు పరిశీలించి.. ఏది బెస్ట్ అన్నది మీరు నిర్ణయించుకోండి. మీకు అనుభవం లేకపోతే.. నిపుణులను సంప్రదించి ఎందులో మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ చేయవచ్చో తెలుసుకోండి. సో కొత్తగా వచ్చింది కదా అనిగుడ్డిగా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు.

courtesy :

https://www.profityourtrade.in/images/logo.png



Tags

Read MoreRead Less
Next Story