మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

మారటోరియం కాలంలో వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశం ఉందని... కేంద్రం తరపున అటార్నీ జనరల్ గతంలో కోర్టుకు తెలిపారు.

కరోనా నేపథ్యంలో మారటోరియం కాలంలో వడ్డీ మాఫిపై... విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం అక్టోబర్‌ 5కు విచారణ వాయిదా వేసింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలను.. సొలిసిటర్ జనరల్‌ ఇవ్వలేకపోయారు. వివరాల సమర్పణకు మరికొంత సమయం కావాలని... సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. మారటోరియంపై కేంద్రం, ఆర్బీఐ వివరాలను సమగ్రంగా తెలపాలని గతంలోనే సొలిసిటర్ జనరల్‌ను జస్టిస్ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం అడిగింది. కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుదిదశలో ఉందని.. సొలిసిటర్ జనరల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో కేంద్రానికి మరింత గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

మరోవైపు... మారటోరియం కాలాన్ని రెండేళ్లపాటు పొడిగించే అవకాశం ఉందని... కేంద్రం తరపున అటార్నీ జనరల్ గతంలో కోర్టుకు తెలిపారు.

అయితే తర్వాత విచారణలో బ్యాంకులకు నష్టం కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకోబోదన్నారు. దీంతో వడ్డీపై వడ్డీ అంశంపై కేంద్రం ఏం చెప్పదలుచుకుందో అన్నది అర్థంకాకుండా ఉంది. దీనిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది. అలాగే తగిన ఆదేశాలు జారీ చేసేంత వరకు మారటోరియం వినియోగించుకున్న రుణాల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మారటోరియం గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో దీన్ని వినియోగించుకుంటున్న రుణగ్రహీతలు కేంద్ర నిర్ణయం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story