రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సెబీ షాక్..! రూ.25కోట్ల జరిమానా !

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సెబీ షాక్..! రూ.25కోట్ల జరిమానా !
దొంగలు పడిన ఆర్నెల్లకి కుక్కలు మొరిగితే ఏమవుతుంది..? సదరు దొంగలు దర్జాదొరలు కావచ్చు. ఇంకా మాట్లాడితే ప్రపంచంలోనే కుబేరులుగా కూడా మారొచ్చు.

దొంగలు పడిన ఆర్నెల్లకి కుక్కలు మొరిగితే ఏమవుతుంది..? సదరు దొంగలు దర్జాదొరలు కావచ్చు. ఇంకా మాట్లాడితే ప్రపంచంలోనే కుబేరులుగా కూడా మారొచ్చు. కటువుగా ఉండొచ్చు, అలానే రిలయన్స్ సంస్థ అంటే తెగ మోసేసేవారికి నచ్చకపోవచ్చు.

కానీ సేమ్ టూ సేమ్ కాకపోయినా, అచ్చంగా అలానే ఏడ్చింది సెబీ నిర్వాకం, దాదాపు 21ఏళ్ల క్రితంనాటి వ్యవహారంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సహా ఇతర ప్రమోటర్లకు పాతిక కోట్ల రూపాయల జరిమానా విధించింది.

ఇంతకీ వీళ్లు చేసిన తప్పు ఏమిటంటే, 1999 మార్చి నుంచి 2000 మార్చి మధ్యలో రెగ్యులేటరీ సంస్థలకి తెలీకుండా, లేదంటే సమాచారం ఇవ్వకుండానే రిలయన్స్ సంస్థలో 6.83శాతం వాటాని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ వాళ్లపై సెబీ ముందున్న ఆరోపణ. ఇందుకోసం తమకి 1994లో ఇష్యూ అయిన 3 కోట్ల వారంట్లను కన్వర్ట్ చేసారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లపై ఆరోపణలు వచ్చాయ్.

అసలు ఏదైనా సంస్థలో ప్రమోటర్లు 5శాతం కంటే వాటా ఎక్కువ స్వాధీనం కానీ, కొనుగోలు కానీ చేసినప్పుడు తమకి ఖచ్చితంగా తెలియజేయాలని, తమ అనుమతి పొందిన తర్వాతే ఆ పని చేయాలని సెబీ రూల్స్ తిరగేసింది.

ఓపెన్ ఆఫర్ ద్వారా పబ్లిక్ షేర్ హోల్డర్లనుంచి మాత్రమే ఈ వాటా కొనుగోలు కుదురుతుందని సెబీ రూల్స్ చెప్తున్నాయ్. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు అలా చేయకపోవడం టేకోవర్ రెగ్యులేషన్స్ లోని 11(1) నిబంధన ప్రకారం చట్ట విరుద్ధం అని సెబీ తాజాగా తన ఆదేశాల్లో పేర్కొంది. అందుకే జరిమానాగా ఆర్ఐఎల్ ప్రమోటర్లకు పాతికకోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది

ఇదొక్కటే కాదు ఈ ఏడాది జనవరిలో కూడా ముఖేష్ అంబానీపై 15కోట్లు , ఆర్ఐఎల్ పై 25కోట్లు, సెబీ ఫైన్ వేసింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం ట్రేడింగ్‌లో అనుచితంగా వ్యవహరించినందుకు ఈ జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లకు కూడా వరసగా 20కోట్లు,10కోట్ల రూపాయల జరిమానా విధించింది. దానిపై ట్రిబ్యునల్‌కి వెళ్తామని అప్పట్లో ఆర్ఐఎల్ ప్రకటించింది.

మరి తాజా సెబీ తీర్పు మాత్రం అమలవుతుందా..? నిజంగానే ముకేష్ అంబానీ&కో ఈ జరిమానా కడతారా , చెప్పలేం, ఎందుకంటే సెబీ అప్పిలేట్ అథారిటీ ఉంది, ఆ పైన ట్రిబ్యునల్ ఉంది. ప్రపంచకుబేరుడికి పాతికకోట్ల రూపాయలు ఓ లెక్క కాదు.

కానీ లీగల్‌గా ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఆ కాస్తా ఎగవేయరని గ్యారంటీ లేదు. అంతే మన చట్టాలు బాగానే ఉంటాయ్. కానీ అమలు చేసే తీరులోనే అసలు లోపమంతా ఉంటుంది..చూద్దాం ఏం జరుగుతుందో !

Tags

Read MoreRead Less
Next Story