స్పల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..

స్పల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..

బుధవారం 195 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్ గురువారం స్వల్ప నష్టాలతో మొదలైంది. 63,350 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈ లోని నిఫ్టీ-50 కూడా స్థిరంగా కొనసాగుతోంది. వార్త రాసే సమయానికి నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లోని హీరో, మహీంద్ర అండ్ మహీంద్రా, టైటాన్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ,హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్ టీలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.924 దగ్గర ట్రేడ్ అవుతోంది.

గత సెషన్‌లో సెన్సెక్స్ సూచీ 63,588 పాయింట్లను తాకి ఆల్‌ టైం గరిష్ఠ స్థాయి అందుకొంది. దేశ జీడీపీ స్థిరంగానే ఉండటం, విదేశీ పెట్టుబడిదారుల వరుస కొనుగోళ్లు, ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో చాలా షేర్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ వాల్యూయేషన్లలో ట్రేడవుతున్న షేర్లనను జాగ్రత్తగా గమనిస్తుండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ముదుపర్ల సంపదగా పరిగణించే సెన్సెక్స్‌-౩౦ గత పలు సెషన్లుగా పైపైకి పోతూ ముదుపర్ల సంపదను భారీగా పెంచుతోంది. ఈ ఒక్క సంవత్సరమే 4 శాతానికి పైగా పెరిగింది. ఇది గత 12 నెలల కాలంలో 23 శాతంకి పైగా పెరిగి ముదపర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో పలు కంపెనీల అధికారులు, సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ముదుపర్లు అక్కడి సమావేశాలు, ఇతర పరిమాణాలపై దృష్టి సారించవచ్చు.

నైరుతి రుతుపవనాల గమనం కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. సాధారణంగా జూన్ 1 న కేరళను తాకుతాయని అంచనా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం జూన్ 8న ప్రవేశించాయి. రుతుపవనాల గమనం మందకొడిగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడనుంది. ఇది దేశ ఆర్థికవ్యవస్థపై పడుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లు వరుసగా 3 వ సెషన్లో కూడా నష్టాలతోనే ముగిసాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు ముదుపర్లను ఆందోళన కలిగించాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలిచ్చారు. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి దిగువకు తేవాలంటే కఠిన నిర్ణయాలుంటాయని సూచించారు. ఈ నేపథ్యంలో ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ప్రధానసూచీలన్నీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story