Tesla-India: భారత్‌లో త్వరలోనే టెస్లా కార్ల ప్లాంట్ ..!

Tesla-India: భారత్‌లో త్వరలోనే టెస్లా కార్ల ప్లాంట్ ..!
ఏడాదికి 500000 యూనిట్ల కార్లను తయారుచేసేందుకు ప్రణాళికలు

భారత్‌లో అతి కొద్ది రోజుల్లోనే టెస్లా(Tesla) ఎలక్ట్రిక్ కార్లు(EV) వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు భారత్‌లో ప్రవేశించేందుకు సన్నాహకాలు ప్రారంభించింది. సంవత్సరానికి 500000 యూనిట్ల కార్లను తయారుచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వఅధికారులతో క్రియాశీలకంగా చర్చలు, సంప్రదింపులు జరుపుతోంది.


ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. రూ.20 లక్షల ప్రారంభ ధరలతో భారత్‌లో ఏడాదికి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసేలా ప్లాంట్‌ని ఏర్పాటు చేయనుంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో టెస్లా అధినేత ఎలన్ మస్క్‌తో భేటీ అనంతరం టెస్లా రాకపై అంచచాలు ఏర్పడ్డాయి. భారత్‌లోనే కార్ల ప్లాంట్ పెట్టాలన్న ఆసక్తిని మే నెలలో టెస్లా కనబరిచింది. భారత్‌లో ప్లాంట్‌లో కార్లను ఉత్పత్తి చేసి ఎగుమతులు చేయాలనేది టెస్లా ఆలోచన. చైనాలో ఇదే విధానం ఆచరిస్తోంది.

భారత్‌లోని స్థానిక విడిభాగాల తయారీదారులు, ఎగుమతిదారులను భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. టెస్లా ప్రయత్నాలు సఫలం అయితే అటు భారత్‌కు, టెస్లాకు లాభదాయకం కానుంది.


టెస్లా భారత్‌లోనే కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా భారత వినియోగదారులకు తక్కువ ధరల్లోనే అత్యాధునిక టెస్లా ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులో రానున్నాయి. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల(EV) వైపు విధానాలు రూపొందిస్తున్న భారత్‌కు కూడా ఈ అంశం ఊపునిస్తుంది. ఈవీ మార్కెట్‌ పరుగులు తీసే అవకాశం ఉంది. అలాగే మన దేశం గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌గా మారాలన్న ఆశయం వైపు అడుగులు పడనున్నాయి.

ఇక ఈవీ కార్లకి దేశంలో డిమాండ్ పెరుగుతుంది. వేగంగా వృద్ధి చెందుతున్న మన దేశంలోకి రావడం వల్ల టెస్లాకి లాభదాయకంగా ఉందనుంది.

భారతదేశంలో ప్రవేశించాలనుకుంటున్నప్పటికీ అత్యధిక ట్యాక్స్‌ రేట్ల కారణంగా రాలేకపోతున్నామని అప్పట్లో టెస్లా నిరాకరించింది. అసలే అత్యధికంగా ఉండే టెస్లా ధరలకు పన్నులు అధికం కావడంతో వినియోగదారులకు చాలా ఎక్కువ ధరల్లో ఆఫర్ చేయాల్సి ఉండేది.

టెస్లా ప్రయత్నాలు విజయవంతం అయితే భారత్‌లో ఈవీ మార్కెట్‌కి, అటు టెస్లాకి కీలక మైలురాళ్లు కానున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story