పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..ఇదే మంచి ఛాన్స్..తగ్గిన బంగారం ధర,పెరిగిన వెండి ధర..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..ఇదే మంచి ఛాన్స్..తగ్గిన బంగారం ధర,పెరిగిన వెండి ధర..!
Gold and Silver Rates Today: గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కాస్త తగ్గింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి

Gold and Silver Rates Today: నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(22-07-2021 గురువారం) బంగారం ధరలు రూ. 390 తగ్గుదల కనిపించింది. నిన్న(21-07-2021) రూ.45,250గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.44,900గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,370గా ఉండగా, ఈ రోజు రూ 48,980గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,120 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,120ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,150ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,980ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే. ఈ రోజు వెండి ధరలు కాస్త పెరిగాయి. కేజీ వెండి ధర రూ 71,500గా ఉంది. నిన్న(21-07-2021 బుధవారం) ప్రారంభ ధరలతో పోలిస్తే రూ 4.000 పెరిగింది. ఈ రోజు(22-07-2021 గురువారం) వెండి 10 గ్రాములు రూ.715గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.71,500గా ఉంది. మంగళవారం రూ.5.400 తగ్గిన వెండి.. బుధవారం నాలుగు వేల రూపాయలు పెరగడం గమనార్హం.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (22-07-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story