హైదరాబాద్‌లో 90 రూపాయల మార్క్‌ దాటిన పెట్రోల్‌ ధర

హైదరాబాద్‌లో 90 రూపాయల మార్క్‌ దాటిన పెట్రోల్‌ ధర
కేంద్ర బడ్జెట్‌లో విధించిన అగ్రిసెస్‌ భారం పెట్రో ధరలపై పడదని చెప్పిన కేంద్రం.. రోజువారీ వడ్డనను మాత్రం కొనసాగిస్తోంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 90 రూపాయల మార్క్‌ దాటింది. కేంద్ర బడ్జెట్‌లో విధించిన అగ్రిసెస్‌ భారం పెట్రో ధరలపై పడదని చెప్పిన కేంద్రం.. రోజువారీ వడ్డనను మాత్రం కొనసాగిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం లీటల్‌ పెట్రోల్‌ 90 రూపాయల 42 పైసలైంది. డీజిల్‌ ధర 84 రూపాయల 14 పైసలకు చేరింది. రేపో మాపో వందకు చేరే పరిస్థితి నెలకొంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.95గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.77.13గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.30గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.80.71గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.49గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.99 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.39గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.82.33గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.85గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.76గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.83గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.82గా ఉంది.

జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.22గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.36గా ఉంది



Tags

Read MoreRead Less
Next Story