ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి!

ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి!
నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో శనివారం(13-02-2021)న లీటర్ పెట్రోల్ ధర రూ.91.65గా ఉండగా.. ఆదివారం (14-02-2021)న లీటర్ పెట్రోల్ ధర రూ.92.26కి చేరింది.

ప్రెటోల్ బాటలోనే డీజిల్ ‌కూడా భగ్గుమంటోంది. హైదరాబాద్‌లో శనివారం(13-02-2021)న లీటర్ డీజిల్ ధర రూ. 85.50గా ఉండగా.. ఆదివారం (14-02-2021)న లీటర్ డీజిల్ ధర రూ.86.23కి చేరింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.73గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 79.06గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.01గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.82.65గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.21గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 85.70 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.96గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.16గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.76గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.87గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.43గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.15గా ఉంది.





Tags

Read MoreRead Less
Next Story