బంగారంపై బడ్జెట్ ప్రభావం.. కొనేముందు తెలుసుకోవలసిన అంశాలు..

బంగారంపై బడ్జెట్ ప్రభావం.. కొనేముందు తెలుసుకోవలసిన అంశాలు..
బంగారానికి 1800 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది.

మరో రెండు నెలల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. పెళ్లి కూతురికి కావలసిన బంగారం కొనడానికి దుకాణానికి వెళ్లే ముందు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి. నిన్న ఆర్థిక మంత్రి నిర్మలమ్మ విడుదల చేసిన బడ్జెట్ 2021లో బంగారంపై ఓ కీలక ప్రతిపాదన చేసారు. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా బంగారంపైకి మళ్లింది. బంగారం, వెండి వస్తువులు కొనాలనుకునేవారు తెలుసుకోవాల్సిన అంశాలు..

1. ఇండియన్ గవర్నమెంట్ సోమవారం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించింది. దీంతో ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2వేలు పడిపోయింది.

2. కేంద్ర ప్రభుత్వం గోల్డ్, సిల్వర్‌పై దిగుమతి సుంకాలను 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. దీనికి తోడు 2.5 స్పెషల్ ట్యాక్స్ కూడా విధించింది.

3.బంగారం దిగుమతులపై నికరంగా చూస్తే 10.75 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ఇది వరకు దిగుమతి సుంకం 12.5 శాతంగా ఉండేది.

4. ఎంసీఎక్స్ మార్కెట్‌లో ఈరోజు గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.8 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.48,340కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం రేటు తగ్గడం ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1855 డాలర్ల వద్ద కదలాడుతోంది.

5.బంగారానికి 1800 డాలర్ల వద్ద మద్దతు లభిస్తోంది. ఈ స్థాయి నుంచి మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది.

6. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం, ఈక్విటీ మార్కెట్లు పరుగులు పెడుతుండడంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతోందని రీసెర్చ్ హెడ్ హరీశ్ తెలిపారు. తాజా దిగుమతి సుంకం తగ్గింపుతో డిమాండ్ పెరగొచ్చన్నారు.

7. గ్లోబల్ మార్కెట్‌లో ఈరోజు వెండి ధర 2 శాతం పడిపోయింది. గత సెషన్‌లో వెండి రేటు 8 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.

8. ఇండియన్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో వెండి రూ.3 వేలకు పడిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story