ఈ ఏడాదైనా ఇల్లు కొనగలమా.. ముందు ముందు మరింత కష్టం!

ఈ ఏడాదైనా ఇల్లు కొనగలమా.. ముందు ముందు మరింత కష్టం!
ఇల్లు కొనాలన్న కల కలగానే మిగిలిపోతుందా.. సొంత ఇంటికల నెరవేరుతుందా..ముందు ముందు రేట్లు ఇంకా పెరుగుతాయి. మరిక అప్పుడసలు కొనలేం. ఏ ఏటి కాయేడు రేట్లు పెరిగేదే..

ఇల్లు కొనాలన్న కల కలగానే మిగిలిపోతుందా.. సొంత ఇంటికల నెరవేరుతుందా..ముందు ముందు రేట్లు ఇంకా పెరుగుతాయి. మరిక అప్పుడసలు కొనలేం. ఏ ఏటి కాయేడు రేట్లు పెరిగేదే... కాని తగ్గేది కనిపించడం లేదు. ఆలస్యం చేస్తే అందుబాటులో ఉన్న ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. స్థిరాస్థి కన్సల్టెన్సీల తాజా సమాచారం ప్రకారం గృహాలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయని చెబుతున్నాయి.

మార్కెట్ అంచనాల ప్రకారం ఇల్లు కొనేవారి సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు కొనాలన్నా గృహ రుణం తీసుకునే వారే అధికం. వస్తున్న ఆదాయం ఎంత.. నెలకు ఎంత ఈఎంఐ చెల్లించగలమనే దానిపై ఆధారపడి ఇంటి రుణం మంజూరవుతుంది. ఇంటి విలువలో 80 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నా.. క్రమం తప్పకుండా నెలవారీ చెల్లించగలిగే స్థోమత ఉందో లేదో కూడా చూసుకోవాలి. దీన్నే ఆదాయ, ఈఎంఐ నిష్పత్తి అంటారు. దీన్నే అఫర్డబుల్ ఇండెక్స్ అని అంటారు.

గత పదేళ్లుగా ఇల్లు కొనే వారి సంఖ్య పెరిగింది. పదేళ్ల క్రితం వరకు ఆదాయంలో సగం జీతం హౌస్ లోన్‌కి కట్టడానికే పోయేది. దాంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని భావించి ఇల్లు కొనాలనే ఆలోచనను విరమించుకునేవారు. కానీ ఇప్పుడు ఆదాయంలో ఇంటి కోసం 31 శాతం కేటాయిస్తే చాలు. గృహరుణ వడ్డీ రేట్టు తగ్గడం కూడా ఒక కారణం ఇంటి కొనుగోలు ఆలోచనకు శ్రీకారం చుడుతున్నారు.

అదే ముంబయిలో ఇల్లు కొనాలంటే ఆదాయంలో 61 శాతం కేటాయించాల్సి వస్తుంది. అందుబాటులో ఉండే ఇళ్లంటే అహ్మదాబాద్‌ని చెప్పుకోవాలి. అక్కడ ఆదాయంలో ఇంటి నిమిత్తంగా 24 శాతం బడ్జెట్‌లో కేటాయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత పుణే, చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ ఇదో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా గత కొంత కాలంగా భూముల ధరలు పెరుగుతుండడంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడింది.

Tags

Read MoreRead Less
Next Story