షావోమీ కంపెనీ మరో సంచలనం.. ఎలక్ట్రిక్ కారు

షావోమీ కంపెనీ మరో సంచలనం.. ఎలక్ట్రిక్ కారు
ప్రస్తుతం కంపెనీ ఆటోమోబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. అందులో భాగంగానే ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి పావులు కదుపుతోంది.

ప్రపంచంలోని అతిపెద్ధ స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో చైనా అగ్ర స్థానంలో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు, ఎలక్ట్రానిక్ గృహోపకరాణాలు తయారు చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ ఆటోమోబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది.

అందులో భాగంగానే ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి పావులు కదుపుతోంది. తాజా నివేదికల ప్రకారం షావోమీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గ్రేట్ వాల్ మోటార్స్‌తో డీల్ చేసుకోనుంది. ఈ సంస్థ భాగస్వామ్యంతో సొంతంగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇరు కంపెనీలు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే చైనాలోని అతి పెద్ద ట్రక్ తయారీ సంస్థ గ్రేట్ వాల్ ఈ సంవత్సరం ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాల కోసం తన సొంత బ్రాండ్‌ను కంపెనీ విడుదల చేసింది. గ్రేట్ వాల్ కంపెనీ జర్మనీకి చెందిన బిఎమ్‌డబ్ల్యూతో కలిసి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. గత ఏడాది 1.11 మిలియన్ పి-సిరీస్ ట్రక్స్, ఓరా ఈవీ వాహనాలను గ్రేట్‌వాల్ విక్రయించింది. ప్రస్తుతం థాయిలాండ్‌లో తన మొదటి కర్మాగారాన్ని నిర్మిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story