నిహారిక కొణెదల కొత్త వెబ్ సిరీస్

నిహారిక కొణెదల కొత్త వెబ్ సిరీస్

మెగా ఫామిలీ నుంచి ఫస్ట్ లేడీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది కొణెదల నిహారిక. హీరోయిన్ గానూ సపోర్ట్ యాక్ట్రెస్ గాను మెప్పించిన నిహారిక త్వరలోనే ఒక న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ తో రాబోతోంది. డెడ్ పిక్సెల్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సో స్ట్రీమ్ కాబోతోంది. ఇంతకు ముందే విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఒక కొత్త కంటెంట్ తో వస్తున్నట్టుగా టీజర్ చూడగానే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ తరం ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా ఉంది. ఈ సిరీస్ లో నిహారిక ఒక గేమర్ గా నటించింది. ఓ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఒక కొత్త తరహా గేమ్ ను క్రియేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పొందింది.. పోగొట్టుకుంది ఏంటి అనే కాన్సెప్ట్ తో వస్తోంది టీమ్. నిహారిక తో పాటు వైవా హర్ష, అక్షయ్,సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు :

ప్రొడక్షన్ హౌస్ : బీబీసీ స్టూడియోస్ ఇండియా Pvt Ltd, Tamada Media Pvt Ltd.

లైన్ ప్రొడ్యూసర్స్ : అనిల్ కుమార్ తీర్రే, సాయి వర్మ వేగిరాజు (RGV)

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : దీపాలు హండా , శ్రీ హర్ష బసవ

ప్రొడక్షన్ డిజైనర్ : శివమ్ రావు

ఎడిటర్ : సృజన అడుసుమిల్లి

మ్యూజిక్ డైరెక్టర్ : సిధార్థ సదాశివుని

డిఓపి : ఫహద్ అబ్దుల్ మజీద్

రైటర్ : అక్షయ్ పుల్ల

హెడ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ : (బీబీసీ స్టూడియోస్) - సిద్ధార్థ్ హిర్వే

ప్రొడ్యూసర్స్ : సమీర్ గోగతే , సాయిదీప్ రెడ్డి బొర్రా , రాహుల్

డైరెక్టర్ : ఆదిత్య మండల

Tags

Read MoreRead Less
Next Story