ఆహాలో మే 5న 'గీతా సుబ్రహ్మణ్యం 3'

ఆహాలో మే 5న  గీతా సుబ్రహ్మణ్యం 3


'గీతా సుబ్రహ్మణ్యం' మూడో సీజన్‌ ఆహాలో రాబోతోంది. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్‌ ఫుల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలను ఎంతో ఫన్నీగా చూపించారు. మూడవ సీజన్ లో.. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం రెడీ అవుతోంది.

గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం, అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్‌లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు. ఈ వెబ్ సిరీస్‌ను టమాడ మీడియా నిర్మిస్తోండగా.. శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు.

Tags

Read MoreRead Less
Next Story