100 Days Celebration for Dasara : ఘనంగా 'దసరా' వంద రోజుల వేడుక

100 Days Celebration for Dasara : ఘనంగా దసరా వంద రోజుల వేడుక
'దసరా' 100రోజుల పండుగ.. షీల్డ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన చిత్ర యూనిట్

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన దసరా సినిమా ఓ ట్రెండ్ సృష్టించింది. నేచురల్ స్టార్ నాని, మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. నాని కెరీర్ లో ఈగ తర్వాత ది బెస్ట్ మూవీగా నిలిచింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. విడుదలైన రోజు నుంచే భారీ కలెక్షన్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం.. ఆగస్టు 8తో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సెలబ్రెషన్స్ చేసుకుంది. షీల్డ్ ఈవెంట్ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలో నాని, ఓదెల శ్రీకాంత్ తో పాటు హీరో సాయి కుమార్ కూడా పాల్గొని.. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు కూడా మూవీ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దసరా సినిమా.. అన్ని లాంగ్వేజెస్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి భారీ హిట్ అండ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకోగా ఇక రెండో రోజుకి అయితే ఏకంగా ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక ఈ సాలిడ్ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన దసరా సినిమాలో నాని తన నటనతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాడు. ధరణి పాత్రకు నాని ప్రాణం పోశారు. మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో నాని అద్భుతంగా నటించాడు. నిజంగానే పిరికివాడిలా, పచ్చి తాగుబోతులా చాలా సహజంగా కనిపించాడు. నాని – కీర్తి సురేష్ ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. వెన్నెలగా కీర్తి సురేష్ డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ కీర్తి సురేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కిందని చెప్పవచ్చు.




Tags

Read MoreRead Less
Next Story