ఆది సాయికుమార్ "సీఎస్ఐ సనాతన్" ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

ఆది సాయికుమార్ సీఎస్ఐ సనాతన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
చాగంటి ప్రొడ‌క్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్".

చాగంటి ప్రొడ‌క్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "సీఎస్ఐ సనాతన్". ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియ‌స్ఐ) ఆఫీస‌ర్‌‌గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్‌‌లో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌‌గా రూపొందుతున్న "సీఎస్ఐ సనాతన్" సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌‌ను తాజాగా విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్‌లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్‌‌తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్‌తో నేరస్తులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్‌‌గా ఉండనుంది. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్నప్ప ,మ‌ధు సూద‌న్, వసంతి తదితరులు

సాంకేతిక వ‌ర్గం - ,

సినిమాటోగ్రఫీ : జిశేఖ‌ర్,

మ్యూజిక్: అనీష్ సోలోమాన్,

పిఆర్ఒ : జియ‌స్ కె మీడియా,

నిర్మాత : అజ‌య్ శ్రీనివాస్

ద‌ర్శకుడు : శివ‌శంక‌ర్ దేవ్

Tags

Read MoreRead Less
Next Story