సినిమా

Acharya OTT Release : చిరు 'ఆచార్య' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Acharya OTT Release: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య..

Acharya OTT Release : చిరు ఆచార్య ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
X

Acharya OTT Release: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య.. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా గత నెల ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలావుండగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మే 20న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

అయితే అదే రోజున చరణ్, తారక్ కలిసి నటించిన RRR సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఆచార్య చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించగా మణిశర్మ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఆచార్య చిత్రం రూ.140 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. సినిమాకి రూ. 84.63 కోట్లు నష్టం వాటిల్లింది.

Next Story

RELATED STORIES