టీవీ నటి శ్రావణి మరణంపై నాకెలాంటి సంబంధం లేదు : దేవరాజ్‌రెడ్డి
టీవీ నటి శ్రావణి సూసైడ్‌కి కారణాలేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి వల్లే సూసైడ్ చేసుకుందని ఆమె..

టీవీ నటి శ్రావణి సూసైడ్‌కి కారణాలేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి వల్లే సూసైడ్ చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతను డబ్బుల కోసం శ్రావణిని వేధించేవాడని ఆరోపిస్తున్నారు. శ్రావణి వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, లక్ష రూపాయలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తానని చెప్పాడంటున్నారు. డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆగకపోవడం వల్లే శ్రావణి చనిపోయింది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. ఐతే.. దేవరాజ్‌రెడ్డి మాత్రం తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించాడు. ఈ సూసైడ్ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. శ్రావణి తనకు కొంత డబ్బు ఇచ్చిన మాట వాస్తవమే అయినా.. అది ఆమెకు సంబంధించిన ఓ బిల్ కట్టేందుకే అన్నాడు. తనకు చివరిసారిగా ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి వల్లే చనిపోతున్నట్టు చెప్పిందన్నాడు దేవరాజ్ రెడ్డి.
మౌనరాగాలు, మనసు మమత లాంటి సీరియళ్లతో ఫేమస్ అయిన శ్రావణి హైదరాబాద్ SR నగర్ మధురానగర్‌లో ఉండేది. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్‌టాక్‌లో పరిచయం అయ్యింది. శ్రావణిని ప్రేమించినట్లు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ దేవరాజ్ ఫొటోలు దిగినట్టు ఆమె బంధువులు తెలిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడనేది శ్రావణి కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కుటంబ సభ్యులు దేవరాజ్‌పై ఆరోపణలు చేస్తుంటే.. అతను తనకు ఏమీ సంబంధం లేదంటున్నాడు. ఈ బలవన్మరణం కేసులో ట్విస్ట్‌ల మీట ట్విస్ట్‌లు చేస్తూంటే పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT