దండాలయ్యా నీలాంటి వాళ్లు ఉండాలయ్యా.. 5 గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరో

దండాలయ్యా నీలాంటి వాళ్లు ఉండాలయ్యా.. 5 గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరో
ఆయన ఓ ఐదు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ సమస్యలను తీరుస్తూ ప్రజలకు చేరువగా ఉన్నారు.

ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం అని మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ చాలా పాపులరైంది.. ఆ చిత్రాన్ని, అందులోని డైలాగ్‌ని స్ఫూర్తిగా తీసుకున్నవారు ఎందరో తమ ఊరికి ఎంతో కొంత చేస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం.. చేసింది కొద్ది సినిమాల్లోనే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలే చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యూ వంటి సినిమాల్లో హీరోగా మెప్పించిన ఆదిత్య గత కొంత కాలంగా వెండి తెరకు దూరంగా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఓ ఐదు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ సమస్యలను తీరుస్తూ ప్రజలకు చేరువగా ఉన్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుపల్లి పరిసరాల్లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ఆదిత్య ఐదేళ్లుగా వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు.

ఆయన ఓ ఐదు గ్రామాలను దత్తత తీసుకుని గ్రామ సమస్యలను తీరుస్తూ ప్రజలకు చేరువగా ఉన్నారు.తాజాగా తన మిత్రుడు, నిర్మాత పీవీఎస్ వర్మతో కలిసి 500 మంది రైతులకు మామిడి, కొబ్బరి విత్తనాలను సరఫరా చేశాడు. గ్రామాల్లోని యువతీయువకులకు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. చేరువల్లి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు.

ప్రస్తుతం ఆదిత్య ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. రాఘవ టి. దర్శకత్వంలో వస్తున్న బందీ అనే చిత్రంలో నటించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story